Begin typing your search above and press return to search.

సాహోకు అదే వరం అదే శాపం!

By:  Tupaki Desk   |   5 Sep 2019 1:30 AM GMT
సాహోకు అదే వరం అదే శాపం!
X
మొదటి నాలుగు రోజులు 330 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు. ఒక్క హిందీ వెర్షన్ నుంచే వంద కోట్ల కలెక్షన్., ఇంకేముంది నెగటివ్ టాక్ ని పడగొట్టుకుని మరీ సాహో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిపోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఆశించారు. కానీ నిన్నటి నుంచి సీన్ మారిపోయింది. వసూళ్లలో గణనీయమైన మార్పు బయ్యర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. నిజానికి అంత మొత్తంలో వసూళ్లు రావడానికి కారణం పండగ కలిసొచ్చిన లాంగ్ వీకెండ్ ప్లస్ భారీగా పెంచేసిన టికెట్ ధరలు.

100 రూపాయలు అమ్మాల్సిన టికెట్ ను ముఖ్యంగా ఎపిలో 200 రూపాయలకు అమ్మడంతో ఈ మేజిక్ ఫిగర్స్ సాధ్యమయ్యాయి. సినిమా మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెండు వారాలకు అనుమతి తెచ్చుకున్న నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఇప్పుడు అదే శరాఘాతంగా మారింది. ఇంత నెగటివ్ టాక్ ఉన్న సినిమాకు అదనంగా డబుల్ అమౌంట్ చెల్లించి ఎందుకు చూడాలనే ప్రశ్న సామాన్యుల్లో వస్తోంది. ఫలితంగా థియేటర్ దాకా రాకుండా తగ్గింపు కోసం చూస్తున్నారు

పోనీ ఎగ్జిబిటర్లు తగ్గించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. ఐదో తేదీ దాకా తగ్గించే సమస్యే లేదన్న రీతిలో ఏపీలోని కీలక కేంద్రాల్లో ఇప్పటికీ 200 ధరనే కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ మాములు స్థితికి టికెట్ రేట్లను తీసుకొస్తే ఎంతో కొంత స్టడీనెస్ కనిపించేది. మొదటి మూడు రోజులు ఏదైతే కాపాడిందో ఇప్పుడు అదే కొంప ముంచుతోంది.

తమకు తగ్గించాలని ఉన్నా ముందే తీసుకున్న అనుమతితో పాటు ట్యాక్స్ కట్టే విషయంలో కమిట్ మెంట్ ఇచ్చేయడం వల్ల సాధ్యపడదని కొందరు హాల్ ఓనర్లు వాపోతున్నారు. ఎల్లుండి నుంచి తగ్గిస్తారా లేక రెండు వారాలకు ఈ పెంపుని కొనసాగిస్తారా అనేదాన్ని బట్టి సాహో వీక్ డేస్ కలెక్షన్స్ ఆధారపడనున్నాయి. హింది తమిళ మలయాళ వెర్షన్లు ఇప్పటికే భారీ నష్టాల దిశగా ప్రయాణిస్తుండగా తెలుగు స్టేటస్ కూడా ఈ వీకెండ్ తో తేలిపోతుంది.