Begin typing your search above and press return to search.
టిక్కెట్టు బాదుడు కల్చర్ ఆగేట్టులేదు
By: Tupaki Desk | 11 Aug 2015 12:18 PM GMTటిక్కెట్టు బాదుడు అనే కల్చర్ ఇప్పటిది కాదు.. పెద్ద హీరోల సినిమాలు రిలీజవుతుంటే ఇది అమల్లోకొచ్చేస్తుంటుంది. పెద్దల ఇన్ ఫ్లూయెన్స్ తో ఇది సాధ్యమే. దీనికి ప్రభుత్వాలు సైతం అడ్డు చెప్పవు. ఎమ్మార్వో, ఎంపీడీవో, సబ్ కలెక్టర్, కలెక్టర్, పోలీస్ సాక్షిగా ఇది యథేచ్ఛగా సాగిపోయే వ్యవహారం. ఒకాయన అయితే ఏకంగా సీఎంలకు కూడా తెలుసిన భోగోతమే. దీనికి అడ్డు కట్ట వేసే నాధుడే లేకపోయే! అంటూ గోడు వెల్లబోసుకున్నాడు. అయినా ఇప్పటికీ పట్టింపు లేదు. అయితే సరిగ్గా ఇదే లొసుగును సినిమావోళ్లు తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు.
ఇటీవలే బాహుబలి సినిమాకి టిక్కెట్టు బాదుడు షురూ చేశారు. భారీ బడ్జెట్ సినిమా.. రికవరీ ఎలా? అంటూ టిక్కెట్టు రేటు పెంచేశారు. ఆ తర్వాత అదే ఫార్ములా అప్లయ్ చేసి శ్రీమంతుడు బాగానే వసూళ్లు గుంజేశాడు. ఇప్పుడు దాన్ని ఆపేయకుండా కంటిన్యూ చేసేయడానికి మిగతా పెద్దలు రెడీ అయిపోతున్నారు. ఇక ముందు రిలీజయ్యే ప్రతి పెద్ద క్రేజీ సినిమాకి ఇక టిక్కెట్టు రేటును యథేచ్ఛగా పెంచుకుని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ కల్చర్ ను కంటిన్యూ చేస్తే ప్రతీ సినిమాకూ ఫాస్టుగా రికవరీ అయిపోతుందని వీరి ఫీలింగ్. ఓ మారు ఈ బాదుడుపై ఆధారపడనున్న గ్యాంగును చూస్తే లిస్టు పెద్దగానే ఉంది.
రామ్‌చరణ్ - వైట్ల సినిమా, గుణశేఖర్ రుద్రమదేవి 3డి, రవితేజ కిక్ 2 ఇలా భారీ ప్రాజెక్టులన్నీ క్యూలో ఉన్నాయి. వీటన్నిటికీ టిక్కెట్టు పెంపు వర్తించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదంతా గుట్టు చప్పుడు కాకుండానే. అయితే ఇలా చేస్తే సామాన్యుడు మునుపటిలానే టిక్కెట్టు బాదుడు భరించలేక థియేటర్లకు వెళ్లకుండా పైరసీని ఆశ్రయిస్తే? అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. టిక్కెట్టు రేట్లు అందుబాటులో ఉన్నప్పుడు కక్కుర్తి అవసరం లేదు. లేనప్పుడే ఇలా అడ్డదారులు తొక్కేది అంటూ కొందరు వాదిస్తున్నారు. సొల్యూషన్ దొరికే వరకూ వెయిట్ అండ్ సీ.