Begin typing your search above and press return to search.
లవర్‌బాయ్‌ల కొట్లాటలో గెలిచేదెవ్వరో!
By: Tupaki Desk | 25 Jun 2015 1:30 PM GMTప్రస్థానంలో చేసిన క్యారెక్టర్ రోల్‌ను మినహాయిస్తే సందీప్ కిషన్ హీరోగా చేసినవన్నీ దాదాపుగా లవర్‌బాయ్ క్యారెక్టర్లే. ఐతే సందీప్ అయినా తన క్యారెక్టర్లకు కొంచెం మాస్ టచ్ ఉండేలా చూసుకున్నాడు కానీ.. నాగశౌర్య మాత్రం పూర్తిగా సాఫ్ట్ క్యారెక్టర్లే చేశాడు. ఇప్పుడు ఈ ఇద్దరు యువ కథానాయకులు మాస్ హీరో అవతారాలెత్తేశారు. ఆ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలవుతుండటం విశేషం. సందీప్ 'టైగర్'గా కనిపిస్తుంటే.. నాగశౌర్య 'జాదూగాడు'గా మారిపోయాడు. ఇద్దరూ ఈ రెండు సినిమాల్లోనూ వీరలెవెల్లో ఫైట్లు చేశారని ట్రైలర్లను చూస్తేనే అర్థమైంది.
ఈ రెండు సినిమాలూ ఆ కుర్ర హీరోల కెరీర్‌కు చాలా కీలకం కావడంతో.. ఫస్ట్ కాపీ రెడీ అయి చాలా కాలమైనా విడుదలకు మంచి టైమింగ్ దొరక్కపోవడంతో వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు. గతంలో రెండు మూడు రిలీజ్ డేట్లిచ్చి వెనక్కి తగ్గిన నిర్మాతలు.. ఎట్టకేలకు సడెన్‌గా ఈ శుక్రవారం ఆ రెండు సినిమాల్నీ థియేటర్లలోకి వదుల్తున్నారు. సందీప్‌కు 'టైగర్' అనే టైటిల్ ఏంటని వేళాకోళం ఆడిన వాళ్లు, నాగశౌర్యను 'జాదూగాడు'గా చూపించడమేంటి అని సందేహించిన వాళ్లు షటప్ అయిపోయేలా రిజల్ట్ ఉంటుందని ఈ రెండు సినిమాల దర్శకులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈ వారం ఇంకో రెండు మూడు సినిమాలు విడుదలవుతున్నా.. అందరి దృష్టీ ఈ రెండింటి మీదే ఉంది. మరి లవర్‌బాయ్‌ల కొట్లాటలో గెలిచేదెవ్వరో చూద్దాం మరి.