Begin typing your search above and press return to search.
రెచ్చిపోతున్న టైగర్
By: Tupaki Desk | 27 Jun 2015 7:30 PM GMTఅసలే చాన్నాళ్లుగా సరైన సినిమాల్లేవు టాలీవుడ్‌లో. మంచి సినిమా వస్తే చూద్దామని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ సినిమాకు హిట్ టాక్ వచ్చింది. పైగా పోటీగా వచ్చిన సినిమాలకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఇక ఆ సినిమాకు అంతకంటే కావాల్సిందేముంది. 'టైగర్' యూనిట్ సభ్యుల ఆనందం మామూలుగా లేదిప్పుడు. తొలి షో నుంచే హిట్ టాక్‌తో మొదలైన 'టైగర్' సాయంత్రానికే గర్జన మొదలుపెట్టేశాడు. మాస్ సినిమా కాబట్టే ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి కానీ.. మార్నింగ్ షో, మ్యాట్నీలకు థియేటర్లు పూర్తిగా నిండలేదు.
కానీ సాయంత్రానికి హిట్ టాక్ బాగా స్ప్రెడ్ కావడంతో హౌస్‌ఫుల్ బోర్డులు పడిపోయాయి. ఈ వీకెండ్ అంతా టైగర్ హవా సాగించేలా కనిపిస్తున్నాడు. పోయిన వారం, అంతకుముందు వచ్చిన సినిమాల సందడి ఇప్పటికే బాగా తగ్గిపోయింది. ఇక 'టైగర్'కు పోటీగా వచ్చిన 'జాదూగాడు' రేసులో నిలిచే అవకాశం లేదని తేలిపోయింది. వేర్ ఈజ్ విద్యాబాలన్ పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదు. ఇలాంటి సమయంలో 'టైగర్'కు యునానమస్‌గా హిట్ టాక్ వచ్చింది. అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకులు.. రెండు వర్గాల నుంచి మంచి టాక్ వచ్చింది 'టైగర్'కు. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదలయ్యే అవకాశం లేదు కాబట్టి జులై 10న 'బాహుబలి' వచ్చేవరకు 'టైగర్' హవా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.