Begin typing your search above and press return to search.

'గర్ల్ ఫ్రెండ్'తో ఏకంగా ఫుట్బాల్ ఆడేస్తున్న టైగర్..!

By:  Tupaki Desk   |   28 Jun 2021 7:38 AM GMT
గర్ల్ ఫ్రెండ్తో ఏకంగా ఫుట్బాల్ ఆడేస్తున్న టైగర్..!
X
బాలీవుడ్ లవ్ బర్డ్స్ దిశాపటాని - టైగర్ ష్రాఫ్ మరోసారి సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు. ఈసారి జిమ్ లో.. బీచ్ లో కాదు. ఏకంగా ఫుట్బాల్ మైదానంలో కనిపించి సర్ప్రైజ్ చేశారు. లవ్ బర్డ్స్ కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హైలైట్ అవుతూనే ఉన్నారు. మాములుగా దిశా - టైగర్ ఇద్దరూ కూడా విహారయాత్రలకు.. డిన్నర్ పార్టీస్ డేటింగ్ వెళ్లడం చూస్తుంటాం. కానీ ఈసారి మైదానంలో కనిపించే సరికి బాలీవుడ్ సినిమా వర్గాలలో.. అభిమానులలో కొంచం కొత్త ఉత్సాహం కనిపించింది. ముంబై బంద్రాలోని ఓ ఫుట్బాల్ మైదానంలో ఈ ఇద్దరూ ఆట ఆడుతూ కనిపించారు.

అయితే వీళ్లు ఫుట్బాల్ ఆడేందుకు అన్నివిధాలా సిద్ధమై రంగంలోకి దిగినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ డ్రెస్ ధరించి ఆటలాడుతూ ఫోటోలలో మెరుస్తున్నారు. టైగర్ దిశా ఇద్దరూ ఆడుతున్న ఫోటోస్ చూడవచ్చు. ఈ మలాంగ్ బ్యూటీ పోనీ టైల్ స్టైల్ లో జుట్టును ముడివేసి.. బ్లాక్ కలర్ అథ్లెటిజర్ ధరించింది. ఇక హీరో టైగర్ ష్రాఫ్ బ్లాక్ కలర్ స్పోర్ట్స్ ప్యాంటుతో బ్లూ కలర్ టి-షర్ట్ ధరించి ఉన్నాడు. ఫోటోలలో ఇద్దరూ నవ్వుతూ చాలా ఎంజాయ్ చేసినట్లు గమనించవచ్చు. అయితే టైగర్ మాస్క్ ధరించగా దిశా మాత్రం మాస్క్ లేకుండానే ఆటలో పాల్గొంది. అంటే లవర్ మీద నమ్మకంతోనే కావచ్చు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే ఈ ఫుట్బాల్ ఆటకు కేవలం టైగర్ - దిశా మాత్రమే కాదు. బాలీవుడ్ సెలబ్రిటీలు అర్జున్ కపూర్.. ఇబ్రహీం అలీఖాన్.. ఆధార్ జైన్ లు పాల్గొనడం కూడా చూడవచ్చు. మైదానంలో ఈ ఐదుగురు చాలా ఎంజాయ్ చేస్తూ ఫుట్బాల్ ఆడటం చూడవచ్చు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కెరీర్ పరంగా టైగర్ ష్రాఫ్.. చివరిగా బాఘీ-2లో కనిపించాడు. ప్రస్తుతం తారా సుతరియా జంటగా హీరోపంతి-2 లో నటిస్తున్నాడు. ఇక దిశాపటాని చివరిగా సల్మాన్ ఖాన్ సరసన రాధేలో మెరిసింది. ఓటిటి రిలీజ్ అయినటువంటి ఆ సినిమా ప్లాప్ అయింది. ప్రస్తుతం అమ్మడు కేటీనా.. ఏక్ విలన్ రిటర్న్స్ అనే సినిమాలలో నటిస్తోంది.