Begin typing your search above and press return to search.

అక్కడికి కూడా కలిసే వచ్చారుగా

By:  Tupaki Desk   |   26 Aug 2017 7:36 AM GMT
అక్కడికి కూడా కలిసే వచ్చారుగా
X
మామూలుగా లవ్ బర్డ్స్ అంటే లోపల లోపల కలసి తిరుగుతారేమో కాని.. బయట మాత్రం దూరంగా ఉంటూ నటిస్తారు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ర్టీలోని ప్రేమికులు అందరూ ఇదే తరహాలోనే ఉంటారు. కాని ఇప్పుడు బాలీవుడ్ ప్రేమికులు మాత్రం పద్దతి మార్చారు. కెమెరాలకు కలిసే కనిపిస్తున్నారు. హగ్గులు కిస్సులూ ఇచ్చుకుంటున్నారు. కాని ప్రేమికులా అంటే మాత్రం నో కామెంట్ అంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఎక్కడపడితే అక్కడ దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్ లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కపుల్ కూంటే హాటుగా కనిపిస్తున్న కపుల్ ఎవరంటే మాత్రం.. కుర్ర హీరో టైగర్ ష్రాఫ్‌ మరియు సెక్సిణి దిషా పటానీ అనే చెప్పాలి. వీళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ అనేస్తూ ప్రతీసారి మాట దాటేస్తారంతే. కాకపోతే ఎక్కడపడితే మాత్రం కలసి కనిపిస్తారు. ఆ కెమిస్ర్టీ చూస్తే వీరి మధ్య ఉన్నదేంటో అందరికీ అర్ధమైపోతుంది. గత రాత్రి అంబాని ఇచ్చిన ఒక పార్టీకి కూడా వీరిద్దరూ కలిసే వచ్చారు. టైగర్ నవ్వుతుంటే.. దిశా అందాలను చిందించేసింది. అందరూ అడిగితే మాత్రం.. మేం జస్ట్ స్నేహితులం అనే చెబుతున్నారు.

ఏదేమైనా కూడా ఇప్పుడు టైగర్ వరుస హిట్లతో దూసుకుపోతుంటే.. దిశా మాత్రం అవకాశాల కోసం ఇబ్బందులు పడుతోంది. ఇద్దరూ కలసి హిట్ కొట్టేద్దామని భాఘీ 2 సినిమాను చేస్తున్నారు. మరి హిట్ కొడితేనే హిట్ పెయిర్ అనిపించుకుంటారు బాసూ!!