Begin typing your search above and press return to search.

ప్రియుడే ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేస్తుండే

By:  Tupaki Desk   |   10 April 2017 11:50 AM GMT
ప్రియుడే ఎక్కువ ఎక్స్ పోజింగ్ చేస్తుండే
X
చాలాకాలం నుండి ప్రేమలో ఉండి కూడా.. కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అనే ట్యాగ్ ను వెనేకేసుకుని తిరుగుతున్న జంటల్లో.. లోఫర్ బ్యూటి దిశా పటాని.. ఆమె ప్రియుడు టైగర్ ష్రాఫ్‌ ఉంటారు. ఈ మధ్యన బాఘీ సినిమాతో హిట్టు కొట్టిన టైగర్.. తరువాత రెండు సినిమాలతో చతికిలపడ్డాడు. ఇక ధోని సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన దిశా.. పెద్ద పెద్ద ఛాన్సులు పట్టలేకపోతోంది. ఇకపోతే వీరి ప్రేమ గోల ఏంటో చూద్దాం పదండి.

నిన్న మధ్యాహ్నం ముంబయ్ లోని ఒక పోష్‌ రెస్టారెంట్ బ్యాక్ డోర్ నుండి బయటకు వస్తూ.. మీడియా కెమెరాలకు చిక్కారు దిశా అండ్ టైగర్. ఎప్పటిలాగానే ఇద్దరూ గబా గబా ఎవరి కార్లలోకి వారు వెళ్ళిపోయారు కాని.. కార్ ఎక్కేలోపు మనోళ్ళు నాలుగు స్నాప్స్ టపీమని తీసేశారు. ఒక ప్రక్కన మేకప్ లేకుండా కూడా తన క్లీవేజ్ అందాలతో దిశా మత్తెక్కిస్తుంటే.. మరో ప్రక్కన అసలు తన ప్రియురాలి కంటే ఎక్కువగా ఎక్సపోజింగ్ చేస్తూ భామలకు మత్తెక్కిస్తున్నాడు టైగర్. బనియన్ వంటి టాప్ లో మనోడు తన సిక్స్ ప్యాక్ కండలను ఆరబోస్తున్నాడు అంతే.

ఏంది బాబూ మనోడు ఈ రేంజులో ఎక్సపోజింగ్ చేస్తుండు అనుకుంటున్నారా.. టైగర్ మొదటి నుండీ అంతే.. సల్మాన్ ఖాన్ తమ్ముడి టైపులో ఫీలవుతుంటాడు. షర్టు వేసుకోవడం కంటే విప్పేయడానికే వీరు ఉత్సాహం చూపిస్తుంటారు. అది సంగతి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/