Begin typing your search above and press return to search.

వర్మ కామెంట్స్ కు టైగర్‌ సూపర్‌ రెస్పాన్స్‌

By:  Tupaki Desk   |   6 Aug 2021 5:35 AM GMT
వర్మ కామెంట్స్ కు టైగర్‌ సూపర్‌ రెస్పాన్స్‌
X
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో చేసే వ్యాఖ్యలు కొన్ని సార్లు చాలా షాకింగ్ గా ఉంటాయి. అవతలి వారి గురించి పెద్దగా పట్టించుకోకుండా తన మనసులో అనిపించింది అనేస్తాడు. బాలీవుడ్‌ స్టార్‌ అయిన జాకీ ష్రాఫ్‌ తనయుడు టైగర్‌ ష్రాఫ్‌ గురించి అప్పట్లో అమ్మాయిల ఉన్నావు.. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో వర్మ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. మీ నాన్న ను నువ్వు ఎప్పుడు మ్యాచ్ చేయలేవు.. కనీసం అబ్బాయిగా అయినా కనిపించేందుకు ప్రయత్నించు అంటూ వర్మ చేసిన వ్యాఖ్యలపై తాజాగా టైగర్‌ ష్రాఫ్‌ స్పందించాడు. గతంలో వర్మ చేసిన వ్యాఖ్యలకు టైగర్‌ చాలా తెలివిగా సూపర్‌ గా రెస్పాన్స్ అయ్యాడు.

సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ హోస్ట్‌ గా ఓ షో కొనసాగుతోంది. ఆ షో కొత్త సీజన్‌ లో టైగర్‌ ష్రాఫ్‌ పాల్గొన్నాడు. ఇంకా టెలికాస్ట్‌ అవ్వని ఆ ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. హోస్ట్‌ అర్బాజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ గతంలో వర్మ చేసిన వ్యాఖ్యలు.. ఆ సమయంలో నీపై వచ్చిన కామెంట్స్ కు నీ సమాధానం ఏంటీ అంటూ టైగర్ ను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు టైగర్ స్పందిస్తూ.. అప్పుడు వర్మ చేసిన కామెంట్స్ నూటికి నూరు శాతం నిజమే. ఫిజిక్ విషయంలో మ్యాన్లీ లుక్‌ విషయంలో నా తండ్రి ని సల్మాన్ ఖాన్‌ తప్ప మరెవ్వరు ఢీ కొట్టలేరు. ఇప్పటికే కాదు ఎప్పటికి కూడా ఆయన రీతిలో ఫిజిక్ ను మెయింటెన్‌ చేయలేనేమో. ఇక బ్రూస్ లీ సర్‌ ను కూడా నేను మ్యాచ్ చేయలేను అన్నాడు. వర్మ గారు అన్నట్లుగా వారిని నేను రీచ్ అవ్వలేను. కాని ఆయన హీరోయిన్ అంటూ చేసిన వ్యాఖ్యలకు నేను ఇప్పటికే నా సినిమాలతో సమాధానం ఇచ్చాను అంటూ చాలా తెలివిగా టైగర్‌ వర్మకు కౌంటర్ ఇచ్చాడు.

బాలీవుడ్‌ హ్యాండ్సమ్‌ హీరోల్లో టైగర్‌ ష్రాఫ్‌ నిలుస్తాడు అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు హీరోయిన్ లా ఉన్నావు అంటూ టైగర్ ను వర్మ ఎద్దేవ చేశాడు. కాని ఇప్పుడు ఎంతో మంది హీరోయిన్స్ ఆయన అంటూ పడి పోతారు. అలాంటి ఫిజిక్ ను దక్కించుకున్న టైగర్‌ ష్రాఫ్‌ ప్రస్తుతం యాక్షన్‌ సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోగా మారాడు. ఆమద్య హృతిక్‌ రోషన్‌ తో కలిసి చేసిన వార్‌ సినిమా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాగీ సిరీస్ లో వరుసగా సినిమాలు చేస్తున్న టైగర్‌ ష్రాఫ్‌ ప్రస్తుతం కూడా మరో భారీ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్‌ ను ఇచ్చేందుకు మేకర్స్ సిద్దం అవుతున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలతో పాటు కొందరు చేసిన నెగటివ్‌ కామెంట్స్ వల్లే టైగర్‌ ష్రాఫ్‌ పట్టుదలతో కష్టపడి ఈ స్థాయికి చేరాడు అనేది కొందరి టాక్‌. మొత్తానికి ప్రస్తుతం బాలీవుడ్‌ లో టైగర్‌ ఓ సంచలనం.