Begin typing your search above and press return to search.

క్లాస్ మేట్ కం స్నేహితురాలితో హీరో గారి లాలూచీ!

By:  Tupaki Desk   |   6 Feb 2022 12:30 AM GMT
క్లాస్ మేట్ కం స్నేహితురాలితో హీరో గారి లాలూచీ!
X
క్లాస్ మేట్ కం స్నేహితురాలితో రొమాన్స్ చేసే అవ‌కాశం అదృష్టం కొంద‌రికే ద‌క్కుతుంది. అలాంటి అరుదైన అవ‌కాశం స‌ద‌రు యంగ్ హీరో ద‌క్కించుకున్నాడు. త‌న‌తో క‌లిసి క్లాస్ లో పాఠాలు నేర్చుకున్న ఈ బ్యూటీ ఎవ‌రో కాదు .. ది గ్రేట్ శ్ర‌ద్ధా క‌పూర్. త‌న‌తో క‌లిసి ఇప్ప‌టికే రెండు సినిమాల్లో న‌టించేసిన టైగ‌ర్ ష్రాఫ్.. ఇప్పుడు మూడో సినిమాకి ఆఫ‌ర్ ఇచ్చాడు. త‌న స్నేహితుడు ఆఫ‌ర్ ఇస్తానంటే కాద‌ని అంటుందా? శ్ర‌ద్ధా కూడా వెంట‌నే ఓకే చెప్పేస్తోంద‌ట‌.

బాలీవుడ్ యాక్షన్ స్టార్స్ టైగర్ ష్రాఫ్- అక్ష‌య్ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ప‌ని చేస్తార‌ని చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. డిసెంబర్ లోనే ఈ ఇద్ద‌రూ న‌టించే సినిమాకి `బడే మియాన్ ఛోటే మియాన్` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్నార‌ని టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆసక్తికరంగా ఇది అమితాబ్ బచ్చన్ -గోవిందాల 1998 చిత్రం టైటిల్ లానే అనిపిస్తోంది. అయితే ఇది ఆ చిత్రానికి రీమేక్ కాదు. అలీ అబ్బాస్ జాఫర్ ద‌ర్శ‌క‌త్వంలో అవుట్-అండ్-అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా భారీ స్థాయిలో రూపొందే చిత్ర‌మిది. నిర్మాణ సంస్థ పూజా ఎంటర్ టైన్ మెంట్ ఆదివారం ప్రకటనకు సిద్ధంగా ఉంది. ప్ర‌స్తుతం హీరోల‌ను ఖరారు చేసినప్పటికీ క‌థానాయిక‌లు ఎవ‌రు? అన్న‌దానిపై చ‌ర్చ‌ కొనసాగుతోంది.

తాజా గుస‌గుస ప్ర‌కారం.. బడే మియాన్ ఛోటే మియాన్ చిత్రాన్ని 5 ఫిబ్రవరి 2022 (ఆదివారం) మధ్యాహ్నం 12:30 గంటలకు అధికారికంగా ప్రకటిస్తారు. వషు భగ్నాని- జాకీ భగ్నాని- దీప్శిక‌ భగ్నాని ఈ క్రేజీ చిత్రానికి నిర్మాతలు. ఇది భారీ స్థాయి ప్రాజెక్ట్. శ్రద్ధా కపూర్ తన బాఘీ 3 సహనటుడు టైగర్ ష్రాఫ్ తో యాక్షన్ రోల్ లో మళ్లీ జతకడుతుండ‌డం మూవీపై క్రేజ్ ను పెంచ‌నుంది. టైగర్ ష్రాఫ్ - శ్రద్ధా కపూర్ ఇంత‌కుముందు బాఘీ -బాఘీ 3 సినిమాల‌కు క‌లిసి ప‌ని చేసారు. వారు చిన్ననాటి స్నేహితులు.. స్క్రీన్ పై గొప్ప కెమిస్ట్రీని పంచుకున్నారు. అందుకే శ్ర‌ద్ధాకు మ‌రోసారి ఇలాంటి ప్రాజెక్ట్ ని ఆఫర్ చేసార‌ట‌. త్వ‌ర‌లోనే దానిపై సంతకం చేయ‌నుంది.

ఈ ప్రాజెక్ట్ రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ‌పై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. టైగర్ ష్రాఫ్ ఇప్ప‌టికే ఇత‌ర‌ షెడ్యూల్స్ తో పూర్తి బిజీగా ఉన్నాయి. హీరోపంతి 2- బాఘీ 4 - గణపత్ పార్ట్ 1 సెట్స్ పై ఉన్నాయి. ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫర్ రెండు ప్రాజెక్ట్ లు పూర్తి చేయాల్సి ఉంది. ఒకటి కత్రినా కైఫ్ తో అలాగే షాహిద్ కపూర్ తో అత‌డు సినిమాలు చేయ‌నున్నారు. శ్రద్ధా కపూర్ అదే సమయంలో రెండు సినిమాల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. రణబీర్ కపూర్ మూవీ.. లవ్ రంజన్ తెర‌కెక్కించే టైటిల్ లేని సినిమాలో న‌టిస్తోంది.