Begin typing your search above and press return to search.

ఎప్పుడూ అదే ఫీట్.. టైగర్ మారడా!?

By:  Tupaki Desk   |   17 July 2016 6:48 AM GMT
ఎప్పుడూ అదే ఫీట్.. టైగర్ మారడా!?
X
బాలీవుడ్ లో డ్యాన్సులకు హృతిక్ రోషన్ ఎలా కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడో.. మార్షల్ ఆర్ట్స్ కు నేనే అనే రేంజ్ లో ట్రై చేస్తున్న హీరో టైగర్ ష్రాఫ్. మొదటి సినిమా నుంచి కేవలం స్టంట్స్.. మార్షల్ ఆర్ట్స్ పైనే బేస్ చేసుకుని లాగించేస్తున్నాడు. తన పర్సనల్ స్ట్రెంగ్త్ ని సినిమాల్లో చూపించి.. క్రేజ్ పట్టేయాలన్నది ఇతగాడి ఐడియా.

ప్రస్తుతం 'ఎ ఫ్లైయింగ్ జాట్' అనే మూవీలో టైగర్ ష్రాఫ్ నటిస్తున్నాడు. ఈ మూవీలో ఓ ఫైట్ సీక్వెన్స్ సూపర్బ్ గా చేయాల్సి ఉంటుందట. అందుకే దీన్ని తనే కొరియోగ్రాఫ్ చేసేసుకుంటున్నాడు. మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ని తనే డిజైన్ చేసేసి తనే చేసేస్తున్నాడన్న మాట. అలాగని.. ఏవేవో కొత్తకొత్తగా చూపించేస్తాడని అనుకోవడానికేమీ లేదు. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నట్లుగా.. తన కాలును అవతలి వ్యక్తి తలపై నుంచి ఎగరేయడం అనే స్టంట్ ఒకటి టైగర్ ష్రాఫ్ కి బాగా వచ్చు. దానితో ప్రతీ పాటలోనూ డ్యాన్సు సీక్వెన్స్ గా అదే చూపిస్తుంటారు. అలాగే తన సినిమాల్లో ప్రతీ ఫైట్ లోను చేస్తుంటారు.

పైగా ఇప్పుడు అదే కొరియోగ్రాఫ్‌ కూడా చేసేస్తున్నాడు ష్రాఫ్ వారసుడు. ఒక్క ఫైట్.. అందులోనూ ఒక్క మూమెంట్ వచ్చని.. పదే పదే అదే చూపిస్తే.. జనాలకు చిర్రెత్తుకొచ్చేస్తుందనే విషయాన్ని ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకొన్నాళ్లు పోతే.. ఎప్పుడూ అదే ఫైట్.. అదే డ్యాన్స్.. ఇక టైగర్ ష్రాఫ్ మారడా అనుకుంటారు ఆడియన్స్.