Begin typing your search above and press return to search.
హీరో సిస్టర్ గుండెలు తీసిన బంటు
By: Tupaki Desk | 27 Dec 2018 1:30 AM GMTఆవిడ కండల హీరో సిస్టర్... బాలీవుడ్ లో పెద్ద స్టార్ హీరో కుమార్తె.. అందుకే ఆవిడ చుట్టూ కెమెరా కళ్లు వెంట పడుతుంటాయి. ముంబై ఫేజ్ 3 ప్రపంచంలో టాప్ రేంజ్ ఫ్రెండ్షిప్స్ తో నిరంతరం వేడెక్కిస్తుంటుంది. ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫోటోలతో చెలరేగుతుంటుంది. ఇంతకీ ఎవరావడ? అంటే జాకీష్రాఫ్ కుమార్తె, టైగర్ ష్రాఫ్ చెల్లెలు కృష్ణ ష్రాఫ్. ప్రస్తుతం యువతరంలో హాట్ టాపిక్ అవుతున్న ఈ వారసురాలు షాకిచ్చే ట్విస్టులతో అదరగొడుతోంది.
అయితే ఇంత చేస్తోంది కథానాయిక అవుతుందా? అంటే ససేమిరా అనేస్తోంది. హీరోయిన్ అవ్వాలంటే వంద శాతం నచ్చి ఆ పని చేయాలి. నేను ఏ పని చేసినా అందులో 100/100 అనే టైపు ఆలోచిస్తున్నాను. అందుకే నేను వెండితెరకు దూరంగా ఉంటున్నాను అని చెప్పి పెద్ద షాకిచ్చింది. తాజాగా తన సోదరుడు టైగర్ ష్రాఫ్ ప్రారంభించిన మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) టోర్నమెంట్పై మోజు పెంచుకుంటోంది.
ఓవైపు బ్రదర్ టైగర్ సినిమాలతో బిజీగా ఉంటాడు కాబట్టి.. ఎంఎంఏ బాధ్యతల్ని కృష్ణ ష్రాఫ్ చేపట్టనుందని తెలుస్తోంది. పనిలో పనిగా ఈ అమ్మడి వాలకం చూస్తుంటే డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ తరహాలో వేడెక్కించే వయ్యారాన్ని వడ్డిస్తూ ఇలా మార్షల్ ఆర్ట్స్ టోర్నీలతో చెలరేగుతుందేమోనన్న సందేహాలొస్తున్నాయి. నా పర్సనల్ స్పేస్ నాకు ఉంటుంది... నాకు స్నేహాలు, స్నేహితులు ముఖ్యం.. నా లోకంలో నేనుంటాను అని చెప్పే ఈ అమ్మడు మునుముందు ఇంకేం కొంపలు ముంచబోతోందో చూడాలి.