Begin typing your search above and press return to search.
పిట్టను వర్మ ఎందుకు వదిలి వెళ్లారు?
By: Tupaki Desk | 31 May 2017 4:23 PM GMTట్వీటులతో వాతావరణాన్ని వేడెక్కించే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉన్నట్లుండి ట్విట్టర్ పిట్ట నుంచి ఎగ్జిట్ కావటం తెలిసిందే. అంత సడన్ గా ఆయన ఎందుకు వెళ్లిపోయారన్నది ఎవరికీ అంతుచిక్కటం లేదు. ఎవరికి దడవనట్లుగా ఉంటూ.. ఎవరి మీద పడితే వారి మీద ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసే ఆయన.. ట్విట్టర్ లో ఉన్నంత కాలం ఎన్నెన్ని వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
తనకెంతో ఇష్టమైన ఫ్లాట్ ఫామ్ ని.. వర్మ ఎందుకు వదిలి వెళ్లాడో ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంత త్వరగా వెనక్కి తగ్గే అలవాటు లేని వర్మకు.. ట్విట్టర్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న విషయాన్ని మర్చిపోకూడదు. తన చిత్రాలకు చిత్రమైన ప్రచారాన్ని తెచ్చి పెట్టుకునే అలవాటున్న ఆయన.. త్వరలో వెబ్ సిరీస్ మొదలు పెడుతున్న వేళ.. ఈ సోషల్ మీడియా చాలా అవసరంగా పలువురు చెబుతుంటారు. అలాంటి కీలక వేళ.. ట్విట్టర్ ను వర్మ ఎందుకు వదిలిపెట్టినట్లు? అన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.
ట్విట్టర్ నుంచి వర్మ ఎగ్జిట్ కావటానికి కారణాలు వెతుకుతున్న పలువురు.. ఒక ఆసక్తికరమైన వాదనను తెర మీదకు తెస్తున్నారు. నిత్యం ఎవరో ఒకరి మీద విరుచుకుపడే వర్మ.. బాలీవుడ్ యువ హీరో టైగర్ ష్రాఫ్ మీద చేసిన వ్యాఖ్యలు రేపిన దుమారం అంతాఇంతా కాదు. విద్యుత్ జమావాల్‌కి ఫోన్ చేసి.. టైగర్ ష్రాఫ్ గురించి వర్మ అన్న మాటల్ని గుట్టుగా రికార్డు చేసి మరీ ట్విట్టర్‌లో ట్వీట్ రూపంలో పెట్టేశారు.
ఎప్పుడూ లేని రీతిలో ఈ ఎపిసోడ్ లో వర్మ అడ్డంగా బుక్ అయ్యారని చెబుతున్నారు. తన ట్వీట్లతో ఎదుటోళ్లకు షాకులిచ్చే వర్మకు.. తొలిసారి అందుకు భిన్నమైన పరిస్థితి ఎదురైందన్నది సమాచారం. తన మీద వస్తున్న ఆరోపణలకు తన వాదనను వినిపించేందుకు సైతం అవకాశం ఇవ్వని రీతిలో ఆడియో రికార్డుతో సహా విద్యుత్ తనను ఇరికించేసరికి.. వర్మ నోట మాట రాలేదట.
ఈ ఎపిసోడ్ లో టైగర్ నేరుగా స్పందించనప్పటికీ.. వెనుక మాత్రం చాలానే చేశారట. ఈ ఉదంతంపై బాలీవుడ్ పెద్ద తలకాయలు వర్మకు భారీగా మొట్టికాయలు వేశారని.. ట్వీట్లను ఆపేస్తే ఒంటికి మంచిదంటూ చెప్పారట. ఈ నేపథ్యంలో కాస్త టైం చూసుకొని మరీ.. వర్మ ట్విట్టర్ పిట్ట నుంచి దూరంగా వెళ్లినట్లుగా చెబుతున్నారు. ఇదొక వాదన అయితే.. ఆ మధ్యన మెగా ఫ్యామిలీ ఇష్యూలోనూ వర్మ చేసిన ట్వీట్లు చిలికి చిలికి గాలివానగా మారటమే కాదు.. ట్విట్టర్ ఎగ్జిట్ కు అదొక కారణమని తెలుస్తోంది. ఏమైనా.. వర్మ ఎగ్జిట్ ఆయన స్వయంకృతాపరాధమనే చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/