Begin typing your search above and press return to search.
ఫైట్లు.. డ్యాన్సులు.. ఇంకేమీ ఉండవా బాబూ
By: Tupaki Desk | 25 July 2017 2:32 PM GMTబాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ హీరోగా తన కెరీర్లో ఒక స్థాయికి మించి ఎదగలేకపోయాడు. ఐతే అతడి కొడుకు టైగర్ ష్రాఫ్ కు మాత్రం బాలీవుడ్లో మంచి ఆరంభమే దక్కింది. ‘పరుగు’ రీమేక్ ‘హీరో పంటి’ హిందీలో మంచి విజయమే సాధించింది. దీంతో పాటు టైగర్ కు కూడా మంచి పేరే వచ్చింది. అతడికంటూ ఒక మార్కెట్ క్రియేటైంది. ఐతే తొలి సినిమా మాదిరి కథా బలం ఉన్న సినిమాల మీద అంత ఆసక్తి చూపించలేదు టైగర్.
ప్రతిసారీ బాడీ చూపించడం.. ఫైట్లు.. డ్యాన్సులతో అదరగొట్టడం.. వీటి మీదే అతడి ఫోకస్ మొత్తం నిలిచింది. అతడి సినిమాలు కూడా ఈ అదనపు ఆకర్షణల చుట్టూనే తిరగడం మొలదైంది. టైగర్ రెండో సినిమా ‘భాగి’.. ‘వర్షం’ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. మాతృకలోని ఫీల్ అంతా తీసేసి దాన్నో ఫక్తు యాక్షన్ సినిమాగా తయారు చేశారు. సినిమా అంతా ఫైట్లే ఫైట్లు. కలెక్షన్లు ఓ మాదిరిగా వచ్చాయి కానీ.. సినిమా చెత్త అని తేల్చారు. తర్వాత ‘ఫ్లయింగ్ జాట్’ అని ఓ సినిమా చేశాడు. అందులోనూ ఫైట్లే ఫైట్లు. అది అట్టర్ ఫ్లాప్ అయింది.
ఇప్పుడు ‘మున్నా మైకేల్’ అనే సినిమాతో పలకరించాడు టైగర్ స్రాఫ్. విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖి ఇందులో ఓ కీలక పాత్ర చేయడం.. ట్రైలర్ కొంచెం ఆసక్తికరంగా అనిపించడంతో సినిమాలో ఏదో ప్రత్యేకత ఉంంటుందనుకున్నారు ప్రేక్షకులు. కానీ ఇందులో కూడా డ్యాన్సులు.. ఫైట్లు తప్ప ఏమీ లేదని తేలిపోయింది. ఈ సినిమాకు పూర్తి నెగెటివ్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ చెత్త సినిమా అని తేల్చేశారు. కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగా ఉన్నాయి. టైగర్ ఇకనైనా కొంచెం ఈ అదనపు ఆకర్షణల సంగతి పక్కన పెట్టి కొంచెం కథాబలమున్న సినిమాలు చేస్తే బెటర్.