Begin typing your search above and press return to search.

దిశాతో డేటింగ్.. టైగర్ కిరాక్ రిప్లై!

By:  Tupaki Desk   |   11 Aug 2019 5:52 AM GMT
దిశాతో డేటింగ్.. టైగర్ కిరాక్ రిప్లై!
X
బాలీవుడ్ లో ప్రేమాయణాలు చాలా కామన్ అని మనకు అనిపిస్తుంది.. ఎందుకంటే సెలెబ్రిటీల లవ్వును మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ అందరూ ఫుల్ గా కవర్ చేస్తారు. అదే మన ఇంటి పక్కనుండే కాలేజీలోనో.. మనం పని చేసే ఆఫీసులోనో ఎన్నో ప్రేమాయణాలు సాగుతున్నా ఎవరూ పట్టించుకోరు. ఎప్పుడైనా ఫోకస్ అంతా సెలెబ్రిటీల లవ్వుపైనే ఉంటుంది. అలానే జిమ్నాస్టిక్స్ వీరుడు టైగర్ ష్రాఫ్ - హాటు బ్యూటీ దిశా పటాని మధ్య గాఢమైన ఎఫైర్ సాగుతోందని చాలా రోజులనుండి బాలీవుడ్ మీడియా బ్రాయిలర్ కోడై కూస్తోంది.

అయితే ఎంతమంది ఎన్నిరకాలుగా అది లవ్ అని.. డేటింగ్ అని మొత్తుకున్నా అటు టైగర్ గారు.. ఇటు దిశాగారు ఒప్పుకుంటే ఒట్టు. మేం జస్ట్ ఫ్రెండ్స్ అంటారు.. ముంబై అంతా చక్కర్లు కొడుతుంటారు. రీసెంట్ గా టైగర్ ష్రాఫ్ సోషల్ మీడియాలో తన అభిమానులతో లైవ్ చాట్ చేశాడు. ఈ చాట్ లో చాలామంది నెటిజన్లు టైగర్ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రశ్నలు.. నాన్నగారు జాకీ ష్రాఫ్ గురించి కుశల ప్రశ్నలు అడిగారు. అయితే కొంతమంది చిలిపి మారాజులు ఉంటారు కదా వారు మాత్రం దిశా పటాని తో లవ్ లో ఉన్నావా? మీ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారట.. నిజమేనా అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా "నాకు అంత రేంజ్ లేదు భయ్యా" అంటూ తప్పించుకున్నాడు. అంతే కానీ 'చేస్తున్నాను.. చెయ్యడం లేదు' అని విషయం తేల్చలేదు. ఈ డైలాగ్ ఎలా ఉంది అంటే 'అత్తారింటికి దారేది' సినిమాలో పవన్ "నేను దుబాయ్ లో డ్రైవర్" అంటాడు కదా అలా ఉంది.

ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం దిశాను ఒక ఇంటర్వ్యూలో టైగర్ గురించి అడిగితే.. టైగర్ నాకు గొప్ప స్నేహితుడని.. కాకపోతే స్లో అని చెప్పింది. తనను ఇంప్రెస్ చేసేందుకు గట్టిగా ట్రై చేస్తున్నానని.. అయినా ఇంప్రెస్ కావడం లేదని తెలిపింది. దిశా పటాని ఏం చేయకుండానే ఇక్కడ కోట్ల మంది జనాలు ఇంప్రెస్ అయిపోతున్నారు. టైగర్ ఎందుకు ఇంప్రెస్ కావడంలేదో ఏంటో. ఏదేమైనా ఈ జోడీ మామూలుగా లేదు. ఒకరేమో నాకంత రేంజ్ లేదు అంటారు. మరొకరేమో ఇంప్రెస్ అవ్వడం లేదు అంటారు. మహా తెలివైన వారిలా ఉన్నారే..!