Begin typing your search above and press return to search.

స్పైడర్ కోసం టైగర్ వచ్చాడు

By:  Tupaki Desk   |   30 Jun 2017 5:18 AM GMT
స్పైడర్ కోసం టైగర్ వచ్చాడు
X
స్పైడర్.. టాలీవుడ్ తోపాటు కోలీవుడ్ కూడా ఇప్పుడు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మహేష్ బాబు మూవీ ఇది. ఈ సినిమాను మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిస్తుండడంతో.. బాలీవుడ్ లో కూడా విడుదల చేయనున్నారు. అంటే హిందీలో కూడా మహేష్ బాబు కూడా హల్ చల్ చేయనున్నాడన్న మాట.

తాజాగా స్పైడర్ కు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ డబ్బింగ్ చెబుతున్నాడనే న్యూస్ హల్ చల్ చేస్తోంది. స్పైడర్ కు టైగర్ తన స్వరం అందిస్తున్న మాట నిజమే అయినా.. ఇది తెలుగు స్పైడర్ కాదు. 'స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్' అంటూ వస్తున్న హాలీవుడ్ మూవీ కోసం.. టైగర్ ష్రాఫ్ తన గొంతు అరువిస్తున్నాడు. ప్రపంచం మొత్తం మెచ్చిన స్పైడర్ మ్యాన్ సిరీస్ లో వస్తున్న ఈ లేటెస్ట్ మూవీపై అంచనాలు ఎక్కువగానే ఉండగా.. హిందీతో పాటు తెలుగు.. తమిళ్ వెర్షన్స్ ను కూడా ఏకకాలంలో రిలీజ్ చేయనున్నారు. వీటిలో హిందీ వెర్షన్ లో హీరో పాత్రకు టైగర్ ష్రాఫ్ తన స్వరం అందిస్తున్నాడు.

రీసెంట్ గా స్పైడర్ మ్యాన్ హిందీ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేయగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టైగర్ ష్రాఫ్.. 'స్పైడర్ మ్యాన్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం ద్వారా నా కల సగం నెరవేరింది' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ప్రపంచం మెచ్చిన పీటర్ పార్కర్ పాత్రలో టామ్ హాలంట్ కనిపించనుండగా.. మిచెల్ కీటన్.. రాబర్ట్ డౌనీ కీలకమైన రోల్స్ చేయనున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/