Begin typing your search above and press return to search.
కృష్ణ కృష్ణ.. బాహుబలుడు ఎవరు ష్రాఫ్?
By: Tupaki Desk | 27 Jan 2019 1:30 AM GMTజాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ ని ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనేలేదు. అన్న టైగర్ ష్రాఫ్ కంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిరంతరం వేడెక్కించే ఫోటోషూట్లతో హడావుడి చేస్తుంటుంది. ఇదివరకూ ఈ అమ్మడి బికినీ ఫోటోలు యువతరాన్ని కిర్రెక్కించాయి. ముంబై ఫేజ్ 3 గాళ్స్ లో కృష్ణా వాలకం పూర్తిగా వేరు. తన వ్యవహారాలు పూర్తిగా డిఫరెంట్ అని తన యాక్టివిటీస్ చెబుతుంటాయి. డాడ్ అంత పెద్ద స్టార్ .. అన్న గారు అంతకుమించిన రైజింగ్ స్టార్.. అయినా కృష్ణ ష్రాఫ్ మాత్రం ఎందుకనో కథానాయికగా ప్రయత్నించలేదు.
హీరోయిన్ గా నటించవచ్చు కదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే అంతే ఘాటైన సమాధానం చెబుతుంది. లైఫ్ అంటే ఇంతేనా.. అంతకుమించి ఇంకేమీ ఉండదా? నాకు నా వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాధించడమే ఇష్టమని కుండబద్ధలు కొట్టేస్తుంది. అందుకే కృష్ణా జోలికి ఏ దర్శకనిర్మాతా వెళ్లలేదు. అందువల్లనే తాను కెమెరా కంటికి దూరంగానే ఉంది. అయితే ఈ భామ ఇటీవలే క్రీడలపై అమితంగా ఆసక్తి కనబరుస్తోంది. పలు రకాల టోర్నమెంట్ లలో భాగస్వామి అవుతూ వాటికి ప్రచారం కల్పించే లేదా బిజినెస్ లో భాగస్వామి అయ్యే పనిలో ఉంది. మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రేజీ టోర్నీలకు అంబాసిడర్ గానూ వ్యవహరిస్తోంది కృష్ణ.
తాజాగా ఈ బ్యూటీ బీచ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఓ ఫోటో అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది. తనతో పాటే కండరగండడు పారస్ నాయల్ అందరి కంటా పడ్డాడు. కృష్ణా ష్రాఫ్ బర్త్ డే సందర్భంగా బోయ్ ఫ్రెండ్ నాయల్ తన ప్రియురాలి బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఇలా డిఫరెంటుగా ప్లాన్ చేశాడని అర్థమవుతోంది. `హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్! నువ్వు నాతో ఉంటే చాలు ఈ లోకమే గమ్మత్తుగా ఉంటుంది!`` అంటూ అదరిపోయే కొటేషన్ ఇచ్చాడు. అతడే ఈ ఫోటోని స్వయంగా ఇన్ స్టాగ్రమ్లో షేర్ చేశాడు. తన బోయ్ ఫ్రెండ్ ని చూశాక జనం మాత్రం షాక్ అవుతున్నారు. కృష్ణ కృష్ణ.. ఎవరు ష్రాఫ్ ఆ బాహుబలుడు? అంటూ ఒకటే సందేహం వెలిబుచ్చుతున్నారు. ఇక ఈ అమ్మడు ప్రయివేట్ లైఫ్ ని ఎంజాయ్ చేసేందుకు అమితాశక్తితో ఉంటుంది... కాబట్టి సరైన కుర్రాడినే సెలక్ట్ చేసుకుందన్నమాట!!