Begin typing your search above and press return to search.
వీడియో: 'వందేమాతరం' పాటతో దేశభక్తిని చాటిన స్టార్ హీరో..!
By: Tupaki Desk | 10 Aug 2021 4:30 PM GMTతెలుగు రీమేక్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ యూత్ స్టార్ టైగర్ ష్రాఫ్.. పర్ఫెక్ట్ ఫిజిక్ తో రియల్ స్టంట్స్ - అదిరిపోయే డ్యాన్సులు చేస్తూ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు సింగర్ అవతరమెత్తాడు టైగర్. స్వాతంత్ర్య దినోత్సవం కోసం ''వందేమాతరం'' అనే స్పెషల్ మ్యూజిక్ వీడియో సాంగ్ ని రూపొందిస్తున్న యువ హీరో స్వయంగా ఆలపించారు. ఫస్ట్ టైం ఇలాంటి పాట పాడుతున్న విషయాన్ని వెల్లడించిన టైగర్.. ‘వందేమాతరం’ అనేది కేవలం పాట మాత్రమే కాదని.. ఇదొక ఎమోషన్ అని అన్నారు. ఇలాంటి స్పెషల్ సాంగ్ ని పాడి దేశానికి అంకితమివ్వడం, మీతో పంచుకోవడం గౌరవంగా భావిస్తున్నానని టైగర్ తెలిపారు.
తాజాగా ''వందేమాతరం'' మ్యూజిక్ సాంగ్ ని విడుదల చేశారు. 'హిందుస్తాన్ మేరీ జాన్.. హిందుస్తాన్.. మేరీ జాన్ మేరీ షాన్..' అంటూ సాగిన ఈ దేశభక్తి గీతానికి విశాల్ మిశ్రా అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. టైగర్ ష్రాఫ్ పాడిన ఈ పాటకు కౌశల్ కిశోర్ సాహిత్యం అందించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ సాంగ్ ను జాకీ భగ్నాని నిర్మించారు. అంకన్ సేన్ - జూలీ వైద్య - రాహుల్ శెట్టి కలిసి చేసిన కొరియోగ్రఫీ ఆకట్టుకుంటోంది. మన దేశ గొప్పదనాన్ని తెలియజేస్తున్న ఈ పాట అందరి మనసులను హత్తుకుంటోంది. ఇందులో విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. 'వందేమాతరం' గీతాన్ని ప్రతి ఒక్క భారతీయుడికి, దేశాన్ని రక్షిస్తున్న త్రివిధ దళాల వారికి అంకితం చేస్తున్నట్లు టైగర్ ష్రాఫ్ ప్రకటించారు.