Begin typing your search above and press return to search.
'టైగర్' కు ప్రధానికి లింకుందట!
By: Tupaki Desk | 1 Jan 2018 5:06 PM GMTగత ఏడాది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ `ట్యూబ్ లైట్ ` సినిమాతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సల్లూ భాయ్ తన తర్వాతి చిత్రం `టైగర్ జిందా హై`పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఏక్ థా టైగర్ కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతోంది. మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ....సల్లూ భాయ్ కెరీర్ లో మరపురాని హిట్ గా మిగలనుంది. అయితే, ఈ సినిమా విజయం వెనుక ప్రధాని మోదీ ఉన్నారని ఆ చిత్ర దర్శకుడు అలీ అబ్బాస్ సంచలన ప్రకటన చేశారు. ఈ చిత్ర మూలకథకు - మోదీకి మధ్య సంబంధం ఉందని ఆయన స్వయంగా వెల్లడించారు.
మోదీ సర్కార్ చేపట్టిన ఓ రెస్క్యూ మిషన్ ఆధారంగా ఈ కథను అలీ రాసుకున్నారట. 2014లో ఇరాక్ లో చిక్కుకున్న 46 మంది నర్సులను కాపాడే ఓ మిషన్ ను చేపట్టిన భారత్ దానిని విజయవంతంగా ముగించింది. మన భద్రతా బలగాలు ఆ నర్సులను విజయవంతంగా భారత్ కు తీసుకువచ్చారు. ఆ కథ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని అబ్బాస్ చెప్పారు. మోదీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ధైర్యంగా అటువంటి రిస్కీ మిషన్ ప్రారంభమైందని చెప్పారు. దీంతో, మోదీ పాలనా చాకచక్యానికి గుర్తుగా ఈ చిత్రాన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు అలీ అబ్బాస్ తెలిపారు. వాస్తవంగా ఈ చిత్రంలో ఓ సందర్భంలో మోదీ పేరు ప్రస్తావనకు వస్తుందట. అయితే, సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో ఆ డైలాగులను తొలగించారట.