Begin typing your search above and press return to search.
సల్మాన్ సినిమా ఫైనల్ గా ఒకే
By: Tupaki Desk | 22 Dec 2017 6:22 PM GMTబాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వార్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అక్కడ 400 కోట్లను దాటించే హీరోలు ఉన్నారు. ఖాన్ త్రయం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని చాలా వరకు పెంచిందని చెప్పాలి. అమీర్ ఖాన్ - షారుక్ ఖాన్ ఒక రకం అయితే కండలవీరుడు సల్మాన్ ఖాన్ మరో రకం. చివరగా ఈ హీరో ట్యూబ్ లైట్ తో ఒక ప్రయోగం చేసి ఊహించని విధంగా డిజాస్టర్ ని అందుకున్నాడు. అయితే ఇప్పుడు ఎలాగైనా మళ్లీ హిట్ కొట్టి 2017 కి విజయం తో వీడ్కోలు పలకాలని టైగర్ జిందా హై సినిమాతో వచ్చాడు.
సల్మాన్ గత హిట్ చిత్రం ఎక్ తా టైగర్ సినిమాకు టైగర్ జిందా హై సీక్వెల్. అయితే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా ఫైనల్ గా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే సినిమా అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా ట్రైలర్ రికార్డుల మోతను మోగించింది. ఇక సినిమా విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్ కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమని తెలుస్తోంది. ట్రైలర్ పెంచిన అంచనాల వరకు సినిమా కూడా తీసుకెళ్లిందని చెప్పాలి. ఎన్నడూ చూడని సరికొత్త యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక కత్రినా కైఫ్ కూడా సల్మాన్ తో యాక్షన్ సీన్స్ తో పాటు రొమాన్స్ ను కూడా చక్కగా బ్యాలెన్స్ చేసింది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పాటు సినిమా కథ అసలైన బలాలు.
సుల్తాన్ కథను తెరకెక్కించిన అబ్బాస్ అలీ జాఫర్ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కంటే ఈ సినిమా ఎక్కువ స్థాయిలో ఆకట్టుకుంటోందని నెటీజన్స్ అలాగే క్రిటిక్స్ కూడా పాజిటివ్ గా రెస్పాన్డ్ అవుతున్నారు. సాధారణంగా సల్మాన్ సినిమాలు యావరేజ్ అంటేనే డబుల్ ప్రాఫిట్స్ అందుతాయి. ఇక సూపర్ హిట్ అంటే ఏమైనా ఉందా కచ్చితంగా సినిమా మరో బిగ్గెస్ట్ బాలీవుడ్ హిట్ అవ్వడం ఖాయం అని సినీ పండితులు చెబుతున్నారు.