Begin typing your search above and press return to search.
ఈ టైగర్ ఒరిజినలా? కాపీయా?
By: Tupaki Desk | 4 Nov 2017 7:49 AM GMTసాదారణంగా చాలా మాంచి దర్శకులు ఒక్కో సారి తీసే సినిమాలు ఒకరి ఇన్ స్పిరేషన్ తో తీశానని చెబుతారు. ఇక కొంత మంది ఏకంగా సినిమానే ప్రేరణగా తీసుకున్నామని చెబుతారు. కానీ ఒక్కోసారి ఆ కామెంట్స్ ప్లస్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు. అయితే ఒక బాలీవుడ్ దర్శకుడు ఇంకా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే తమ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని గొప్పలు చెబుతూనే.. ఒక సినిమా ఇన్ స్పిరేషన్‌గా తెరకెక్కించాను అంటున్నాడు.
అతను ఎవరో కాదు సల్మాన్ ఖాన్ కు ఇష్టమైన దర్శకులలో ఒకడైన అబ్బాస్ జాఫర్. ఈ దర్శకుడు ఇంతకుముందు సల్లు బాయ్ తో సుల్తాన్ అనే సినిమాను తీసి మంచి హిట్ అందుకున్నాడు. అయితే అదే తరహల్ ఇప్పుడు మరో భారీ బడ్జెట్ తో టైగర్ జిందా హై అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. సల్మాన్ సరసన హాట్ బ్యూటీ కత్రినాకైఫ్ నటిస్తోంది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అలుముకున్నాయి.
ఆయితే ఈ తరుణంలో చిత్ర దర్శకుడు జాఫర్.. ఒక నేపధ్య సంగీతాన్ని ట్విట్టర్ లొ పోస్టు చేసి దాన్ని ఉపయోగించి మ్యూజిక్ ట్రాక్ లేదా ట్రైలర్‌ను క్రియేట్ చేయమని చెప్పాడు. అంతే కాకుండా 'టైగర్ జిందా హై' చిత్రం అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌కు ట్యాగ్ కూడా చేయమన్నాడు. విషయం ఏంటంటే.. టామ్ క్రూజ్ నటించిన హాలీవుడ్ చిత్రం 'మిషన్ ఇంపాజిబుల్' బ్యాగ్రౌండ్ స్కోర్ అది. అందుకే ఇప్పుడు నెటిజన్లు.. కొంపతీసి ఇలా మ్యూజిక్ బిట్ తో పాటు.. సినిమాను కూడా లేపేస్తున్నారా అంటున్నారు. ఈ టైగర్ ఒరిజినలా? కాపీయా? అంటూ కౌంటర్లు వేస్తున్నారు.