Begin typing your search above and press return to search.
స్పేస్ లో టిక్ టిక్ టిక్
By: Tupaki Desk | 15 Aug 2017 8:21 AM GMTహాలీవుడ్ వచ్చే సైన్స్ ఫిక్షన్.. స్పేస్ సినిమాలు చూసి ఆస్వాదిస్తూ.. ఇలాంటి సినిమాలు మన దగ్గర రావా అంటూ నిట్టూర్చడం మామూలే. మన దర్శకులకు కూడా అలాంటి భారీ ఆలోచనలు ఉన్నప్పటికీ.. ఇలాంటివి మన దగ్గర సాధ్యమా అన్న సందేహాలతో మొగ్గ దశలోనే ఆ ఆలోచనల్ని తుంచేసేవాళ్లు. కానీ ‘బాహుబలి’ లాంటి సాహసోపేత ప్రయత్నాల్ని చూశాక మిగతా దర్శకులకూ ధైర్యం వస్తోంది. మన వాళ్లు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తమిళంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ స్పేస్ మూవీ తెరకెక్కుతుండటం విశేషం. ఇండియాలో రాబోతున్న తొలి స్పేస్ మూవీగా దీన్ని ప్రచారం చేస్తున్నారు.
‘తనీ ఒరువన్’తో దేశవ్యాప్తంగా పాపులరైన జయం రవి నటిస్తున్న ఈ సినిమా పేరు.. ‘టిక్ టిక్ టిక్’. ఈ చిత్ర టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీజనల్ స్థాయిలో ఇలాంటి సినిమానా అంటూ టీజర్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏ దేశం కూడా 20 కిలోలకు మించి అణ్వాయుధాన్ని తయారు చేయకూడదని ఒప్పందం ఉందని.. ఐతే ప్రపంచంలో ఏ దేశం కూడా తాళలేని 200 కిలోల మిస్సైల్ మన దగ్గర ఉందని.. దేశానికి ఏదైనా ఆపద వస్తే మనం చూస్తూ ఊరుకోమని ఓ సైనికాధికారి చెప్పడంతో ఈ టీజర్ మొదలవుతుంది. ఆ మిస్సైల్ ను నడిపించేవాడే హీరో. జయం రవి స్పేస్ సైంటిస్టుగానే కాక మెజీషియన్ గానూ కనిపిస్తున్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ అవీ హై స్టాండర్డ్స్ లోనే ఉన్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. ఇంతకుముందు జయం రవితో జాంబీ ఫిలిం ‘మిరుతన్’ తీసిన శక్తి సౌందర్ రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.