Begin typing your search above and press return to search.
ఆ అమ్మాయి గురించి నాకు చెప్పండన్న డీజే టిల్లు!
By: Tupaki Desk | 13 Sep 2022 8:30 AM GMTసాధారణంగా ఒక అందమైన అమ్మాయి గురించి ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటే, కొన్ని క్షణాల్లో ఆ చుట్టూ చేరిపోయేవారు చాలామందినే ఉంటారు. అలాంటి ఒక అందమైన అమ్మాయి గురించి మీకు చెప్పాలి అంటూ ఒక అబ్బాయి అంటే, వినడానికి ఎవరు మాత్రం సిద్ధంగా ఉండరు? ఆ కథాకమామిషు తెలుసుకోవడానికి ఎవరు మాత్రం ఆసక్తిని చూపించరు? అందువల్లనే అలాంటి ఒక టైటిల్ తోనే ఇంద్రగంటి మోహనకృష్ణ ఒక సినిమాను రూపొందించాడు. సుధీర్ బాబు జోడీగా కృతి శెట్టి నటించిన ఈ సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. హీరో హీరోయిన్లతో పాటు వెన్నెల కిశోర్ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఈ ముగ్గురినీ 'డీజే టిల్లు' హీరో సిద్ధు జొన్నలగడ్డ ఇంటర్వ్యూ చేశాడు. తమ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని డీజే టిల్లును అడుగుతూ .. ఆయనకి తమ సినిమా కథను చెతున్నట్టుగా ఒక కామెడీ కాన్సెప్ట్ అనుకుని, ఇంటర్వ్యూ కొత్తగా అనిపించేలా డిజైన్ చేసుకున్నారు. తన కేరక్టర్ గురించి సుధీర్ మాట్లాడుతూ .. " సినిమా డైరెక్టర్ గా కాస్త యాటిట్యూడ్ ఉండే పాత్రలో కనిపిస్తాను.
ఈ సినిమాలో కమర్షియల్ డైరెక్టర్ పాత్ర నాది. అందువలన నా సినిమాలో ఫైట్లు మంచి ఐటమ్ సాంగ్ కూడా ఉంటాయి. వివేక్ సాగర్ మంచి ట్యూన్ ఇచ్చాడు. యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి ఈ సాంగ్ తప్పకుండా కనెక్ట్ అవుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక కృతి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను 'ఐ' డాక్టర్ గా కనిపిస్తాను. నా పాత్ర చాలా స్ట్రాంగ్ గా .. కాన్ఫిడెంట్ గా ఉంటుంది. ఈ పాత్ర ఆడియన్స్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ గారు ఈ పాత్రను గురించి చెబుతున్నప్పుడే నేను ఊహించుకున్నాను. నాకు బాగా నచ్చడం వల్లనే ఓకే అన్నాను" అంటూ చెప్పుకొచ్చింది.
వెన్నెల కిశోర్ మాట్లాడుతూ, "నేను హీరో దగ్గర కో డైరెక్టర్ గా కనిపిస్తాను. అంతకుముందు డైరెక్టర్ గా ఉన్న నేను కో డైరెక్టర్ గా ఎందుకు మారవలసి వచ్చిందనేది కామెడీగా ఉంటుంది" అంటూ నవ్వేశాడు. అంతా అయిన తరువాత వివేక్ సాగర్ నుంచి కాల్ వచ్చిందంటూ సుధీర్ లిఫ్ట్ చేస్తాడు. 'సారీ టిల్లూ .. ఆల్రెడీ వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చేసేశాట" అంటాడు.
'అయ్యో .. నేను ఈ సినిమాకి పనిచేస్తున్నట్టు మా కాలనీలో అందరికీ చెప్పేసి వచ్చినగదనే' అంటూ టిల్లూ తెల్లమొహం వేస్తాడు. ఈ సినిమా రోలింగ్ టైటిల్స్ కి కొట్టండి .. లేదంటే 'ఆ అమ్మాయి గురించి మళ్లీ మీకు చెప్పాలి' అనే సినిమా తీసినప్పుడు కొడుదురుగాని అంటూ వెన్నెల కిశోర్ ఇచ్చిన పంచ్ తో ఈ ఇంటర్వ్యూ ముగిసింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.