Begin typing your search above and press return to search.

టీవీలకు అతుక్కుపోతున్న జనాలు.. రేటింగ్స్ ఫుల్

By:  Tupaki Desk   |   4 April 2020 12:30 AM GMT
టీవీలకు అతుక్కుపోతున్న జనాలు.. రేటింగ్స్ ఫుల్
X
లాక్ డౌన్ వేళ అన్నీ బంద్ అయిపోయాయి.. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. వ్యాపార, వాణిజ్యాలు బంద్ అయి కోట్లలో నష్టం వాటిల్లుతోంది. జనాలంతా ఇంటికే పరిమితం కావడంతో ఏ వ్యాపారం ముందుకు సాగడం లేదు. కానీ లాక్ డౌన్ వేళ టీవీ ఇండస్ట్రీ మాత్రం కళకళలాడుతోంది. చాలా మంది ఇంట్లో రోజంతా టీవీ చూస్తూ గడిపేస్తున్నారు.

దేశంలో తాజాగా లెక్కల ప్రకారం టీవీ రేటింగ్స్ పీక్స్ లో ఉన్నాయి. టీవీ వీక్షణం ఏకంగా రికార్డు స్థాయిలో 37శాతం పెరిగినట్లు ‘బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)’ గురువారం ప్రకటించింది. లాక్ డౌన్ కావడంతో టీవీ రేటింగ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని బార్క్ చీఫ్ ఎగ్జి క్యూటివ్ సునీల్ లుల్లా తెలిపారు.

ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. సీరియల్స్ షూటింగ్స్ కూడా ఆగిపోయాయి. దీంతో టీవీల్లో పాత సీరియళ్లు రామాయణం, శక్తిమాన్ లు వేస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ వేస్తున్నారు. ఇక కొత్త సినిమాలు, ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలను తిరిగి వేస్తున్నారు. దీంతో ప్రజలంతా ఆసక్తితో టీవీలకే అతుక్కు పోతున్నారు. నాన్ ప్రైమ్ టైమ్ లో కూడా వీక్షకుల సంఖ్య భారీగా పెరుగుతోందని బార్క్ తెలిపింది. కాలక్షేపం లేక జనాలు టీవీలకు అతుక్కు పోతుండడంతో టీవీ రేటింగ్స్ విపరీతంగా పెరిగి పోతున్నాయి.