Begin typing your search above and press return to search.
మైండ్ సెట్ మారితే థియేటర్ వ్యవస్థకు గండమే!
By: Tupaki Desk | 16 April 2020 5:31 AM GMTసినిమా వాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అన్ని రంగాలపై కరోనా వైరస్ ప్రభావం వేరు. సినీ రంగంపై వేరు అన్నట్టుగానే ఉంది. అన్ని భాషల్లోనూ సినీరంగాలకు వాటిల్లుతున్న నష్టంపై అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు. కరోనా మహమ్మారీ టాలీవుడ్ కి తీరని నష్టం మిగిల్చింది. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే థియేటర్లు మూత పడటంతో తీవ్రంగానే నష్టాలొస్తున్నాయి. జూన్... జూలై నాటికి అయినా థియేటర్లు తెరుచుకుంటే ఆ నష్టాలను కొంతవరకూ తగ్గించుకోవచ్చని భావించారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తోన్న కథనాలు చూస్తుంటే థియేటర్లు ఇప్పట్లో తెరిచేలా లేరని అర్థమైపోతోంది. దీనిపై ఇప్పటికే ఎగ్జిబిటర్ కం అగ్రనిర్మాత డి.సురేష్ బాబు స్పందించారు. థియేటర్లు రీ ఓపెన్ చేయడానికి చాలా సమయం పడుతుందని సూచన ప్రాయంగా వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలపై రకరకాల విశ్లేషణలు వేడెక్కించాయి.
ఇక అమెజాన్.. నెట్ ప్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలు లాక్ డౌన్ ని ఎన్ క్యాష్ చేసుకుంటున్నాయి. గత నెల రోజుల నుంచి సినీ ప్రియులంతా ఓటీటీ అందిస్తోన్న వినోదాన్నే ఆస్వాధిస్తున్నారు. ఈ ప్రాసెస్ చూస్తుంటే థియేటర్లకు వచ్చే జనాల మైండ్ సెట్ మునుముందు అనూహ్యంగా మారనుందా? అన్న ఆందోళన నెలకొంది. జనాలు మళ్లీ థియేటర్ వైపు చూస్తారా? అన్న సందేహాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. కరోనాతో పని లేకుండానే ఇప్పటికే థియేటర్ కు జనాలు రావడం బాగా తగ్గిపోయింది. తాజా పరిస్థితులు...ఓటీటీకి అలవాటు పడిపోయిన నేపథ్యంలో సినీ ప్రియులు మళ్లీ మూస విధానంలో ఇటు వైపు చూస్తారా? అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నటి టిస్కా చోప్రా ఓటీటీని ఉద్దేశించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓటీటీకి అంతా అలవాటు పడిపోతున్నారు. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ప్రేక్షకులకు థియేటర్ కు వస్తారని నేను అనుకోవడం లేదు. ఈ విషయం తలుచుకుంటే గుండె ఆగినంత పనవుతోంది. కానీ కొన్ని నిజాలు నమ్మక తప్పదు. థియేటర్ లోకి వెళ్లిన తర్వాత తలుపులు అన్ని మూసేస్తే వైరస్ మనుషుల్ని ఇంకా తినేస్తుంది. ఇలాంటి సన్నివేశం మనకి అవసరమా? అంటూ హెచ్చరించింది. ఏడాది పాటు జనాల్లో ఇదే అభిప్రాయం ఉంటుంది. వ్యాక్సిన్ కనుగొని అది కామన్ మ్యాన్ కి అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా భయం పోయేది. అందుకు ఎలా లేదన్నా ఏడాది సమయం పడుతుందని తెలిపింది. ఈ నటి మాటలు గనుక వాస్తవ రూపం దాల్చితే అది తీరని నష్టమే. దేశంలో ఉన్న సినీ పరిశ్రమలకు నష్టాలు ఊహించని విధంగా ఉంటాయి. ముందుగా సినీ రంగంపై ఆధారపడిన కార్మికులు నడి రోడ్డున పడతారు. సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకు రారు. తద్వారా హీరోలు.. దర్శకులు ఖాళీ అవ్వాల్సిన పరిస్థితి. సినిమాలు లేకపోతే పంపిణీ రంగం.. బయ్యర్లు అంతా ఖాళీ అవ్వాల్సిందే. చూసారా! కంటికి కనిపించని మహమ్మారీ వైరస్ ఎంతగా కుదిపేస్తుందో. చైన్ సిస్టమ్ ని తేనె తుట్టలా కదిపింది కరోనా.