Begin typing your search above and press return to search.

కమల్‌ ఖైదీ కాంబోకు 'గురు' కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   7 Oct 2020 4:15 AM GMT
కమల్‌ ఖైదీ కాంబోకు గురు కన్ఫర్మ్‌
X
యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఒక వైపు ఇండియన్‌ 2 సినిమాలో నటిస్తున్నాడు. వరుసగా ఏదో ఒక కారణం వల్ల ఆ సినిమా షూటింగ్‌ నిలిచి పోతూ వస్తోంది. దర్శకుడు శంకర్‌ ఆ సినిమాను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా పూర్తి కాకుండానే కమల్‌ తదుపరి సినిమాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఖైదీ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు కమల్‌ ఓకే చెప్పాడు. ఇటీవలే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. పొలిటికల్‌ డ్రామాగా ఆ సినిమా రూపొందబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇక ఆ సినిమాకు 'గురు' అనే టైటిల్‌ ను అనుకుంటుననారట. వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ థైర్‌ లివ్డ్‌ ఏ ఘోస్ట్‌ అనే క్యాప్షన్‌ తో విడుదల అయిన పోస్టర్‌ అందరి దృష్టిని ఆకర్షించింది. ఘోస్ట్ ఏమైనా ఇందులో చూపిస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఒక పక్కా కమర్షియల్‌ పొలిటికల్‌ మూవీగా ఈ సినిమా ఉంటుందంటూ తమిళ మీడియా వర్గాల వారు చెబుతున్నారు. కమల్‌ హాసన్‌ పొలిటికల్‌ గా ప్రస్తుతం యాక్టివ్‌ గా ఉన్న విషయం తెల్సిందే. ఆ కారణంగానే ఆయనకు ఈ పొలిటికల్‌ మూవీ మైలేజ్‌ ను ఇస్తుందనే ఉద్దేశ్యంతో కూడా ఉన్నారు.

వచ్చే ఏడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ సినిమాను కమల్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. విలక్షణ తమిళ నటుడిగా పేరు దక్కించుకున్న విజయ్‌ సేతుపతి 'గురు' సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో వెళ్లడయ్యే అవకాశం ఉంది.