Begin typing your search above and press return to search.

అయోమయంలో చెప్పాలా.. వద్దా ?

By:  Tupaki Desk   |   6 Oct 2019 1:30 AM GMT
అయోమయంలో చెప్పాలా.. వద్దా ?
X
అప్పుడప్పుడు కొన్ని సినిమాల టైటిల్స్ ఒకే రకంగా ఉంటూ ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటాయి. తాజాగా ఓ రెండు సినిమాల టైటిల్స్ ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీ వర్గాలను కూడా అయోమయంలో నెట్టేస్తున్నాయి. ఒకరేమో చెప్తా అంటుంటే మరొకరేమో చెప్పొద్దు అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు. అవును తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' , రాకేశ్ హీరోగా నటించిన 'ఎవ్వరికీ చెప్పొద్దు' టైటిల్స్ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి .

రెండు సినిమాలు రిలీజ్ కి దగ్గరలో ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలెట్టారు. ఒకే టైంలో ప్రమోషన్స్ జరుగుతుండటంతో సినిమా అంటే దూరంగా ఉండేవారితో పాటు సినిమాలు చూసే వారికి కూడా ఈ కన్ఫ్యూజన్ మొదలైంది. ఉన్నపళంగా ఎవరినైనా ఈ సినిమాల గురించి అడిగితే దాని టైటిల్ దీనికి దీని టైటిల్ దానికి చెప్తారు. అందులో ఆశ్చర్యమే లేదు. అంతలా టైటిల్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి మరి.

'మీకు మాత్రమే చెప్తా' సినిమాను విజయ్ దేవరకొండ నిర్మించగా 'ఎవరికీ చెప్పొద్దు' సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు. అటు విజయ్ ఇటు దిల్ రాజు రెండు సినిమాలకు ఏదో ఉన్నంతలో ప్రమోషన్స్ చేస్తున్నారు. మరి ఇదే నెలలో థియేటర్స్ లోకి రానున్న ఈ సినిమాలు రిలీజ్ తర్వాత ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తాయో ?