Begin typing your search above and press return to search.

టైటిల్ లాంచ్‌: ఎవ‌రి మాటా విన‌ని క్రాక్ పోలీసోడు

By:  Tupaki Desk   |   14 Nov 2019 4:14 AM GMT
టైటిల్ లాంచ్‌: ఎవ‌రి మాటా విన‌ని క్రాక్ పోలీసోడు
X
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ క‌థానాయ‌కుడి గా గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వం లో ఆర్.టి 66ని ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఠాగూరు మ‌ధు ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కం గా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ప్రీలుక్ లో ర‌వి తేజ ఖాకీ తొడిగి తుపాకి ప‌ట్టుకుని మౌన‌మునిలా క‌నిపించాడు. ఈసారి ఏదో సంథింగ్ స్పెష‌ల్ గా చేస్తున్నాడ‌నే అభిమానుల‌ కు అర్థ‌మైంది. ఈ సినిమాకి ఓ ఆస‌క్తిక‌ర టైటిల్ కోసం సెర్చ్ చేస్తున్నార‌ని తెలిసింది. తాజాగా సెట్స్ కు వెళ్ల‌క ముందే టైటిల్ ని ఖ‌రారు చేసింది యూనిట్. క్రాక్ అనే టైటిల్ తో పోస్ట‌ర్ ని రిలీజ్ చేసారు. ర‌వితేజ శైలి.. మాస్ ఇమేజ్ కు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. ర‌వితేజ లుక్ ని కూడా రిలీజ్ చేసారు. టైటిల్- లుక్ ని బ‌ట్టి చూస్తుంటే ఇది కూడా మాస్ మ‌సాలా సినిమా అనే అర్థ‌మ‌వుతోంది.

అయితే ఈసారి ద‌ర్శ‌కుడు కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారం గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని పోస్ట‌ర్ ద్వారా రివీల్ చేసారు. అలాగే ఈరోజే సినిమా ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకుంటుంద‌ని వెల్ల‌డించారు. ఇందు లో ర‌వితేజ స‌ర‌స‌న శ్రుతిహాస‌న్ న‌టిస్తోంది. ర‌వితేజ ఫేవ‌రెట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్.ఎస్. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవ‌ల రెండ‌క్ష‌రాల టైటిళ్ల‌ తో తెలుగు సినిమా శైలి కొత్త‌గా క్రిస్పీగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం క్రాక్ ఆ కోవ‌లోనే ఆక‌ట్టుకుంది. క్రాక్ అనేది తెలుగు లోగిళ్ల‌ లో విరివిగా ఉప‌యోగించే ప‌దం. చెప్పింది వినే టైపు కాక‌ప‌తే వీడికి క్రాక్ ఎక్కువ‌! అనేస్తాం. మాస్ రాజా ఖాకీ తొడిగితే ఎవ‌రినీ లెక్క చేయ‌డ‌ని క్రాక్ చూపిస్తాడ‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం ర‌వితేజ వి.ఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం లో డిస్కో రాజా చిత్రం లో న‌టిస్తున్నాడు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లో నే సినిమా విడుద‌ల కానుంది. నేల టిక్కెట్టు నిర్మాత రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.