Begin typing your search above and press return to search.
దర్శకేంద్రుడి వారసుడికే టైటిల్ చిక్కు
By: Tupaki Desk | 21 Jun 2019 8:41 AM GMTఒకప్పుడు సినిమా కంటెంట్ లేదా టైటిల్ విషయంలో ఎలా చూపించినా పెట్టుకున్నా నడిచిపోయేది కాని ఇప్పుడున్న మనోభావాల ట్రెండ్ లో ప్రతిది ఆచితూచి నిర్ణయం తీసుకోక తప్పదు. ఇప్పుడిది ప్రత్యక్షంగా అనుభవంలోకి వస్తోంది దర్శకుడు ప్రకాష్ కోవెలమూడికి. ఇతను దర్శకేంద్రులు రాఘవేంద్ర రావు వారసుడన్న సంగతి విదితమే. ఇతని లేటెస్ట్ బాలీవుడ్ మూవీ మెంటల్ హై క్యా సెన్సార్ చిక్కుల్లో ఇరుక్కుంది.
టైటిల్ మానసిక రుగ్మతలతో బాధ పడుతూ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకునే వాళ్ళను ఎగతాళి చేసినట్టు ఉందని ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి అనుమతించే సమస్య లేదని సెన్సార్ అధికారులు తేల్చి చెప్పారట. కొందరు ఇప్పటికే ఈ టైటిల్ వివాదం గురించి కోర్టుకు సైతం వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దెబ్బకు మెంటల్ హై క్యా విడుదల అయోమయంలో పడింది. వచ్చే నెల విడుదలను ఇంతకు ముందే ప్రకటించారు. ఇప్పుడు దానికి కట్టుబడి ఉండాలంటే టైటిల్ మార్చాలి.
హీరొయిన్ కంగనా రౌనత్ దర్శకుడు ప్రకాష్ ఇద్దరికీ అది ఇష్టం లేదు. మరోవైపు ఇది కథకు తగ్గట్టు పెట్టిన పేరని మేకర్స్ ఎంతగా సర్దిచేబుతున్నా సెన్సార్ బోర్డ్ వినడం లేదు. చూస్తేనేమో మార్కెట్ లో ప్రేక్షకుల్లో టైటిల్ ఇంతకు ముందే రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు మారిస్తే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సబ్జెక్టు డిమాండ్ మేరకు పెట్టామని ప్రకాష్ ఎంతగా చెబుతున్నా అది అరణ్య ఘోషగానే మిగలనుంది. గతంలో ఇలాంటి ఇష్యూ వల్లే పవన్ కళ్యాణ్ కొమరం పులిలో మొదటిసగం తీసేసి ఉట్టి పులి పేరుతో రిలీజ్ చేశారు. మరి ఈ మెంటల్ సినిమాకు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి