Begin typing your search above and press return to search.
'కేడీ' టైటిల్ టీజర్: చస్తే వీర మరణం.. గెలిస్తే సింహాసనం..!
By: Tupaki Desk | 20 Oct 2022 3:07 PM GMTఇటీవల కాలంలో కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన పలు చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్నాయి. 'కేజీఎఫ్ 1' & 'కేజేఎఫ్ చాప్టర్-2' సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి కన్నడ సినిమా స్థాయిని పెంచాయని చెప్పాలి. ఆ తర్వాత వచ్చిన 'చార్లీ 777' 'విక్రాంత్ రోణా' చిత్రాలు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు అందుకున్నాయి. రీసెంట్ గా 'కాంతారా' సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఇప్పుడు శాండల్ వుడ్ నుంచి వచ్చే సినిమాలపై ఫోకస్ ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న ''కేడీ'' అనే సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ''KD - ది డెవిల్''. శాండల్ వుడ్ స్టార్ డైరెక్టర్ ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. కన్నడతో పాటుగా తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసిన మేకర్స్.. గ్రాండ్ గా నిర్వహించిన ఈవెంట్ లో టైటిల్ టీజర్ ను ఆవిష్కరించారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ 'కేడీ - ది డెవిల్' టైటిల్ టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు. ''రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం..'' అంటూ వచ్చిన ఈ మాసివ్ వీడియో మైండ్ బ్లోయింగ్ గా ఉంది. కాళీ అనే వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అవుతుండగా.. సిటీలోని పోలీసులంతా అలర్ట్ అయ్యి.. ఎట్టి పరిస్థితుల్లోనూ సిటీలో అడుగుపెట్టనివ్వకూడదని 144 సెక్షన్ ను పెడుతున్నారు.
'కాళీ రిలీజ్ అవ్వగానే అతన్ని చెంపేయడానికి ఒక్కరు కాదు. ఇద్దరు కాదు.. వేలమంది జనం రెడీగా ఉన్నారు' అని పోలీసులు చెబుతుండగా.. దానికి పూర్తి భిన్నంగా జైలు నుంచి అతన్ని ఊరేగింపుగా తీసుకెళ్లడానికి జన సముద్రం పోగైంది.
అయితే అప్పటికే జైలు నుంచి వెళ్ళిపోయిన కాళీ.. వెంటనే ఒకడిని అంతమొందించి నిప్పుల్లో ఈడ్చుకుంటూ వస్తున్నాడు. 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధం చెయ్యాల్సిందే.. చస్తే వీర మరణం.. గెలిస్తే సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అని పవర్ ఫుల్ డైలాగ్ చెబుతూ ధృవ సర్జాని పరిచయం చేసారు.
చేతిలో పెద్ద కత్తి పట్టుకొని భుజాన శవాన్ని వేసుకుని యాక్షన్ ధృవ సర్జాని ఊర మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసారు. 'కేడీ' సినిమాలో అతను పవర్ ఫుల్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నట్లు టైటిల్ టీజర్ తోనే హింట్ ఇచ్చారు. అర్జున్ జన్యా బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విలియం డేవిడ్ విజువల్స్ అతని పాత్రని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. షో మ్యాన్ ప్రేమ్ ఈసారి 1970ల బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ వింటేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
'KD' చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. టైటిల్ టీజర్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 'అద్దూరి' 'బహద్దూర్' 'భర్జరి' తదితర చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ధృవ సర్జా.. 'పొగరు' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. గతేడాది విదులైన ఈ సినిమా ఇక్కడ పెద్దగా ఆడకపోయినా 'కరాబు' అనే సాంగ్ తో కన్నడ హీరో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ''కేడీ - ది డెవిల్'' అంటూ వస్తున్న ధృవకి ఈసారి ఎలాంటి సక్సెస్ అందుతుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.