Begin typing your search above and press return to search.

టైటిల్ టీజ‌ర్ : వీర‌య్య ఎంట్రీ అరాచ‌క‌మే బాస్!

By:  Tupaki Desk   |   24 Oct 2022 9:20 AM GMT
టైటిల్ టీజ‌ర్ : వీర‌య్య ఎంట్రీ అరాచ‌క‌మే బాస్!
X
మెగాస్టార్ చిరంజీవి # 154వ చిత్రం 'వాల్తేరు వీర‌య్య' పై నెల‌కొన్న అంచనాలు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. సినిమా ప్రారంభానికి ముందే త‌న అభిమాన‌మంతా సినిమాపై చూపిస్తాన‌ని ద‌ర్శ‌కుడు బాబి ప్రామిస్ చేసాడు. అదే మాట‌ను నేటికి చెప్పుకుంటూ వ‌స్తున్నాడు. ఇటీవ‌లే చిరంజీవి సైతం ఊర మాస్ పాత్ర పోషిస్తున్న‌ట్లు...కొన్నేళ్ల త‌ర్వాత అలాంటి ఆహార్యంలో క‌నిపించ‌డంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ ని తీసుకొస్తుంద‌న్నారు.

దీంతో సినిమా పై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. ఓ వైపు బాబి..మ‌రోవైపు చిరు అంతా కాన్పిడెంట్ గా క‌నిపించ‌డంతో? సినిమా సంగ‌తేంటో చూడాల‌ని సినీ గోయ‌ర్స్ లోనూ ఉత్కంఠ మొద‌లైంది. మ‌రి ఆ మాట‌ని ఎంత వ‌ర‌కూ నిల‌బెట్టుకుంటాడు అన్న‌ది తెలియాడానికి స‌మ‌యం ప‌డుతుంది గానీ..అంత‌కు ముందు శాంపిల్ టీజ‌ర్ మాత్రం ఫ్యాన్స్ లో పూన‌కాలు తెప్పిస్తోం ది.

దీపావ‌ళి సంద‌ర్భంగా కొద్ది సేప‌టి క్రిత‌మే 'వాల్తేరు వీర‌య్య' టైటిల్ టీజ‌ర్ ని రిలీజ్ చేసారు. టీజ‌ర్ ఆద్యంతం మాస్ కోణంలో దించేసాడు. రిలీజ్ కి ముందే టైటిల్ టీజ‌ర్ తోనే బాబిలో మాస్ మ‌యాంగిల్ ఎలా ఉంటుంద‌న్న‌ది స్ప‌ష్టంగా క‌నిపిపస్తుంది. 'ఏంట్రా ఆడొస్తో పూన‌కాల‌న్నారు. అడుగేస్తే అరాచ‌కం అన్నారు. ఏవ‌డ్రా మీ అన్న‌య్య‌. సౌండే లేదు అని వాల్తేర్ మాస్ బ్యాచ్ అంటే..ఏకంగా విధ్వంసంతోనే వీర‌య్య రంగంలోకి దిగ‌డం చూస్తుంటే ఫ్యాన్స్ పూన‌కాలు ఖాయ‌మే.

అన్న‌య్య అడుగేస్తే అరాచ‌క‌మేన‌ని అర్ధ‌మ‌వుతుంది. సౌండ్ కాదు..రీసౌండే ఉండ‌ద‌ని చూపించాడు. ఇక వీర‌య్య మాస్ లుక్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అభిమానులు ఊహించిన దానికంటే ఊర మాస్ లుక్ రెండింత‌లు ఎక్కువే క‌నిపిస్తుంది. లుంగీ..గ‌ళ్ల చొక్కా..నోట్లో బీడీ... ముక్కు నుంచి పొగ‌ లాగే తీరు..చెవికి పోగు..మెడ‌లో బంగారు గొలుసులు ఒక‌టేంటి వాల్తేరు వీర‌య్య‌ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసారు. చిరు మాస్ వాక్ అరాచ‌క‌మే.

ఇలాంటి ఎంట‌ర్ టైనింగ్ ధ‌మాకా ఇంకా చూడాల‌నుకుంటే లైక్..షేర్ స్ర్కైబ్ అంటూ చిరు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటుంది. దీపావ‌ళి మొత కొన్ని గంట‌ల ముందే ప్రారంభ‌మైంది. టైటిల్ టీజ‌ర్ నే ఈ రేంజ్లో వ‌దిలారంటే? అస‌లు టీజ‌ర్..ఆ త‌ర్వాత రిలీజ్ అయ్యే ట్రైల‌ర్ ఇంకే రేంజ్ లో ఉంటుందో ఊహ‌కే వ‌దిలేయాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.