Begin typing your search above and press return to search.
హాట్ గా ఉండలేనంటున్న కిలాడీ భామ
By: Tupaki Desk | 8 Feb 2016 3:30 PM GMTకిలాడీ భామలు అంటూ తెలుగులో డబ్ అయిన ఛార్లీస్ ఏంజల్స్ మూవీలో.. హాట్ బ్యూటీ ఎరంటే డ్రూ బ్యారిమోర్. ఇంతకాలం తన అందాలతో అభిమానులను అళరించిన ఈ సుందరి.. ఇకపై తాను హాట్ గా ఉండలేనంటూ.. ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. హాట్ ఉండడం అంటే.. శరీరం కాదని అదో భావన మాత్రమేనంటూ వేదాంతం కూడా మొదలుపెట్టేసింది.
రీసెంట్ గా హార్పర్స్ బజార్ మేగజైన్ లో హాట్ హాట్ లుక్ తో కనిపించింది డ్రూ. అయితే.. అన్నిసార్లు టాప్ హీరోయిన్ గా కంటిన్యూ కావడం చాలా కష్టమని, ఇది సాధ్యం కూడా కాదని చెప్పిన ఈ భామ.. కాలంతోపాటు మారుతూ పాత్రల్లోను జీవితంలోనూ వైవిధ్యం చూపించాలని కూడా అనింది. ఇంతగా వేదాంతం మాట్లాడుతున్న డ్రూ బ్యారిమోర్ ఏజ్ ప్రస్తుతం 40 ఏళ్లు. ‘హాట్ ఉండడం అంటే అని మనలో ఉండే ఓ ఉత్సాహం లాంటింది. మనసులో ఉన్న ఫీలింగ్ కారణంగానే ఎవరైనా హాట్ గా కనిపిస్తారు. అంతే కానీ హాట్ అంటే టాప్ హీరోయిన్ గా ఉండడమో లేక అందంగా ఆకర్షించే శరీరం ఉండడమో కాదు.’ అనింది ఈ సీనియర్ సుందరి.
ఛార్లీస్ ఏంజల్స్ తో పాటు ఈటీ(ఎక్స్టా టెరెస్టియల్) వంటి సినిమాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ హాలీవుడ్ భామ.. ప్రస్తుతం చాలానే వ్యాపారాలు చేస్తోంది. వాటితో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పిన డ్రూ.. కీర్తి, ప్రతిష్టలు అన్నీ తాత్కాలికమే అని, ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఓ ఉచిత సలహా కూడా ఇచ్చింది.