Begin typing your search above and press return to search.

చురకల్లో టైగర్ ఆరి తేరుతున్నాడే

By:  Tupaki Desk   |   4 May 2017 5:42 AM GMT
చురకల్లో టైగర్ ఆరి తేరుతున్నాడే
X
మైకేల్ జాక్సన్.. ప్రపంచానికి డ్యాన్స్ సత్తా ఏంటనే విషయాన్ని తెలియచెప్పిన లెజెండ్. ఇప్పుడీయన మన మధ్య లేకున్నా.. ప్రపంచంలో డ్యాన్స్ ఉన్నంత కాలం మైకేల్ జాక్సన్ నిలిచిపోతాడు. అంతటి మహనీయుడితో తనను పోల్చుకోలేదు కానీ.. దాదాపు అలాంటి స్టేట్మెంట్ నే ఇచ్చాడు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్.

ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ మున్నా మైకేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది డ్యాన్స్ బేస్డ్ గా సాగే మూవీ. యాక్షన్ హీరోగా సత్తా చాటుతున్న టైగర్ ష్రాఫ్.. ఒక్కసారిగా డ్యాన్సింగ్ రూట్ లోకి మారిపోయాడు. దీనిపై తాజాగా వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కొన్ని కామెంట్స్ చేశాడు. దీనికి నేరుగా స్పందించని టైగర్ ష్రాఫ్.. ఇన్ డైరెక్ట్ గా చురకలు అంటించాడు. 'నా డ్యాన్స్ పై కామెంట్ చేయడం అంటే.. డ్యాన్సింగ్ దిగ్గజాలు అయిన మైకేల్ జాక్సన్.. హృతిక్ రోషన్ లను అవమానించడమే. అయినా సరే కొంతమంది నాపై రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు' అంటూ వర్మకు చురకేశాడు టైగర్.

గతంలో కూడా టైగర్ ష్రాఫ్ యాక్షన్ స్టైల్ పై వర్మ విపరీతమైన కామెంట్స్ చేశాడు. ఆ సమయంలో కూడా వర్మను డైరెక్టుగా ఏమీ అనకుండా.. 'వర్మ లాంటి వ్యక్తి గురించి కామెంట్స్ చేసే స్థాయి నాకు లేదు' అంటూ కౌంటర్ బాగానే వేశాడు. ఇప్పుడు ఏకంగా మైకేల్ జాక్సన్ ను అవమానిస్తున్నాడని పంచ్ వేశాడు. చూస్తుంటే చురకలేయడంలో.. వర్మను మించిపోయేలా ఉన్నాడు టైగర్ ష్రాఫ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/