Begin typing your search above and press return to search.

హీరో మెడ‌పై ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్ క‌త్తి!!

By:  Tupaki Desk   |   10 May 2019 4:48 AM GMT
హీరో మెడ‌పై ప్ర‌త్య‌ర్థి గ్యాంగ్ క‌త్తి!!
X
తెలుగు కుర్రాడైన విశాల్ ప్ర‌స్తుతం కోలీవుడ్ లో అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. హీరోగా నిర్మాత‌గా స‌త్తా చాటుతున్నాడు. శ‌క్తియుక్తులున్న యువ‌కుడిగా అత‌డు రాజ‌కీయాల్లోనూ అంతే స్పీడ్ గా ఉన్నాడు. ఓవైపు న‌డిగ‌ర సంఘం.. నిర్మాత‌ల మండ‌లిలో అత‌డి హ‌వా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ రైతుల త‌ర‌పున నిలిచి కేంద్రానికి మోదీకే ఎదురెళ్లిన ఘ‌నుడిగా విశాల్ పేరు మార్మోగిపోయింది. అయితే త‌మిళ గ‌డ్డ‌పైనా... కోలీవుడ్ లో తెలుగు కుర్రాడైన విశాల్ ఆధిప‌త్యాన్ని కొంద‌రు స‌హించ‌లేక‌పోతున్నార‌ని ఇటీవ‌ల ప‌రిణామాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే శ‌ర‌త్ కుమార్ విశాల్ కి ప్ర‌త్య‌ర్థిగా రాజ‌కీయాల్ని నడుపుతున్న సంగ‌తి తెలిసిందే.

ప‌లువురు నిర్మాత‌లు అత‌డిపై ర‌క‌ర‌కాల ఆరోప‌ణ‌లు చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మైంది. అయితే అవ‌న్నీ ఆధిప‌త్యం కోసం సాగుతున్న పోరాటం అని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం విశాల్ పై నివురుగ‌ప్పిన నిప్పులా కొంద‌రు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు క‌త్తిగ‌ట్టార‌ని తెలుస్తోంది. దీంతో అస‌లు కోలీవుడ్ లో ఏం జ‌రుగుతోంది..? కోర్టుల ప‌రిధిలో సాగుతున్న పోరాటంలో విశాల్ నెగ్గుకు రాగ‌ల‌డా లేదా? అంటూ అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అప్ప‌ట్లో ప్ర‌త్య‌ర్థులైన భార‌తీరాజా బృందం త‌న అనుమ‌తి లేకుండా నిర్మాత‌ల మండ‌లికి తాళం వేయ‌డం.. అటుపై విశాల్ త‌న బృందంతో వ‌చ్చి దానిని ప‌గ‌ల‌గొట్టి లోనికి వెళ్ల‌డం ఈ ఎపిసోడ్స్ అన్నీ తెలిసిన‌వే. అటుపై రాష్ట్ర ప్ర‌భుత్వం నియ‌మించిన అధికారి శేఖ‌ర్ ఈ ఉదంతంపై క‌మిటీ వేయ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. విశాల్ వ్య‌తిరేక బృందం.. భారతిరాజా, ఎస్వీ శేఖర్‌, త్యాగరాజన్‌, రాజన్‌, శివ, శివశక్తి పాండియన్‌, దురైరాజ్‌, రాధాకృష్ణన్‌.. వీళ్లంతా ఆ క‌మిటీలో ఉండ‌డంతో ఇక విశాల్ కి తిప్ప‌లు త‌ప్ప‌లేదు. అస‌లు ఆ ప్ర‌త్యేక అధికారి .. ప్ర‌త్యేక క‌మిటీ వ‌ద్దంటూ విశాల్ హైకోర్టులో స‌వాల్ విసిరాడు.

ఆ క‌మిటీవాళ్లంతా గత కొంత కాలంగా విశాల్‌ కు వ్యతిరేకంగా పలు ఆరోపణలు చేస్తున్నారు. అదొక్క‌టేనా.. ఈ ప్రత్యేక బృందం ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని మర్యాదపూర్వకంగా కలవ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. వీళ్లంద‌రినీ వ్యతిరేకిస్తూ నిర్మాతల మండలి అధ్యక్షుడి హోదాలో విశాల్‌ హైకోర్టులో పోరాటం సాగిస్తున్నారు. ఇటీవ‌లే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నేడు(మే10) ఈ పిటిషన్ పై కోర్టు విచారిస్తోంద‌ని తెలుస్తోంది. కోర్టులో నెగ్గితే విశాల్ బ‌లం పెరుగుతుంది. అటుపై అత‌డు మ‌రింత ప‌దునుగా మైండ్ గేమ్ ఆడ‌తాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు.