Begin typing your search above and press return to search.
ఫ్రైడే క్యూలో నిలుచున్న వారిలో ఎవరు ది బెస్ట్?
By: Tupaki Desk | 9 Dec 2022 2:20 AM GMTప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలు కచ్ఛితంగా రిలీజవుతున్నాయి. కానీ వాటిలో ఆడేది ఏది.. పోయేది ఏది? ఎవరూ ఊహించలేకపోతున్నారు. ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాలు థియేటర్లలో దండయాత్రకు వస్తున్నాయి. వీటిలో ఒకట్రెండు పేర్లు మాత్రమే జనాలకు గుర్తుకొస్తాయి. ఆ రెండు సినిమాల్లో ఒకటి `పంచతంత్రం` .. రెండోది `గుర్తుందా శీతాకాలం`. కొద్దో గొప్పో ఈ సినిమాలకు ప్రచారం కనిపిస్తోంది కాబట్టి జనాలకు గుర్తున్నాయి.
వీటితో పాటు మరో అరడజను చిత్రాలు రిలీజవుతున్నా కనీసం వాటి టైటిల్స్ కూడా జనాల మైండ్ లోకి రీచ్ కాలేదంటే ప్రమోషన్ ఎంత వీక్ గా ఉందో అర్థం చేసుకోవాలి. సినిమా తీయడం ఒక ఎత్తు అనుకుంటే ఈరోజుల్లో ప్రచారపుటెత్తుగడలు మార్కెటింగ్ నైపుణ్యం అనేవి మరో ఎత్తుగడగా చూడాలి. కానీ అలాంటివేవీ లేకుండానే బరిలోకొచ్చేస్తున్నాయి కొన్ని.
ఇక ఈ సినిమాల్లో గుర్తుందా శీతాకాలం పోస్టర్లు టీజర్లతో ఆకట్టుకుంది. కానీ ఎందుకనో రిలీజ్ కొద్దిరోజుల పాటు వాయిదా పడింది. కానీ ఇప్పుడు నూతనోత్సాహంతో ఈ సినిమాని రిలీజ్ అవుతోంది.
సత్యదేవ్- తమన్నా భాటియా జంటగా నటించిన `గుర్తుందా సీతకాలం` ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. నాగశేఖర్ ఆర్ దర్శకత్వంలో భావన రవి- నాగశేఖర్ -రామారావు చింతపల్లి నిర్మించారు. కన్నడ హిట్ చిత్రం లవ్ మాక్ టైల్ కి అధికారిక తెలుగు రీమేక్ ఇది. ఇంతకుముందు విడుదలైన ట్రైలర్ కూల్ అండ్ లవ్లీ యాంబియెన్స్ తో ఆకట్టుకుంది. సత్య దేవ్ పాత్ర ఆసక్తికరం. ఈ చిత్రంలో వివిధ దశలలో భిన్నమైన ప్రేమకథలను నడిపించే కుర్రాడిగా అతడు కనిపిస్తాడు. ఆశ్చర్యకరంగా అతడు నటించిన ప్రతి ప్రేమకథ శీతాకాలంతో ముడిపడి ఉంటుంది. ఈ చిత్రంలో తమన్నా భాటియా- మేఘా ఆకాష్- కావ్య శెట్టి లాంటి టాప్ క్లాస్ హీరోయిన్లతో అతడు రొమాన్స్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. భామలతో ప్రేమలో పడే కుర్రాడిగా సత్యదేవ్ కనిపించనున్నారు. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సత్య హెగ్డే రిచ్ విజువల్స్ .. లక్ష్మీ భూపాల డైలాగ్స్ ఈ సినిమాకి ప్లస్ కానున్నాయి.
మరొక కోణంలో ఈ మూవీ కథాంశం ఆసక్తిని కలిగిస్తుంది. ప్రేమించిన యువతిలో నిజమైన ప్రేమను కనుగొనడం కోసం సాగించే ప్రయాణంలో అనేక సార్లు హార్ట్ బ్రేక్ అయ్యే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ప్రయాణానికి సంబంధించిన కథ ఇది. టైటిల్ కి తగ్గట్టే కథాంశం క్యూరియస్ గా సాగుతుంది. పూర్తి స్థాయి రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ ఇది. తమన్నా లాంటి సీనియర్ నటితో సత్యదేవ్ రొమాన్స్ ఎలా ఉండనుందో తెరపైనే చూడాలి. ఈ చిత్రంలో సుహాసిని మణిరత్నం ఓ కీలక పాత్రలో నటించారు. మేఘా ఆకాష్ అతిధి పాత్రలో కనిపించనుందని సమాచారం. ట్రైలర్ సహా విజువల్స్ కి ఇప్పటికే అద్భుత స్పందన వచ్చింది. శ్రీ వేదాక్షర మూవీస్ సహకారంతో నాగశేఖర్ మూవీ- మణికంఠ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై భావన రవి- నాగశేఖర్-రామారావు చింతపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మరోవైపు 'పంచతంత్రం' కంటెంట్ ఉన్న సినిమా అంటూ హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ కితాబివ్వడం చూస్తుంటే ఈ సినిమాలో ఏదో గమ్మత్తయిన విషయం ఉండి ఉంటుందని అంచనా ఏర్పడింది. తెలుగు ఆంథాలజీ చిత్రం పంచతంత్రం ఈ రోజు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. హర్ష పులిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకకు హాజరైన వారిని ఉద్దేశించి స్టార్ డైరెక్టర్ హరీష్ మాట్లాడుతూ.. పంచతంత్రంను అందరూ చిన్న సినిమాగా పరిగణిస్తున్నారని.. అయితే ఇది కంటెంట్ రిచ్ ఫిల్మ్ అని అన్నారు. మేకర్స్ విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్.. ముఖ్యంగా టైటిల్ ట్రాక్ తనకు నచ్చిందని కూడా అతను పేర్కొన్నాడు. ఈ సినిమాని థియేటర్లలో మాత్రమే ఎంజాయ్ చేయాలని సినీ ప్రేమికులను కోరాడు.
స్వాతిరెడ్డి- శివాత్మిక రాజశేఖర్- సముద్రఖని- నరేష్ అగస్త్య- ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు ఈ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి - శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ వెంచర్ ను ఎస్ ఒరిజినల్స్ - టికెట్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి.
వరుసగా క్రేజీ సిరీస్ లు క్యూలో
అటు బాలీవుడ్ లో ప్రముఖ నటుడు రణ్ దీప్ హుడా నటించిన #CAT డిసెంబర్ 9 (శుక్రవారం)న నెట్ ఫ్లిక్స్ లో విడుదలకానుంది. ఇది సంవత్సరంలో చివరి నెలలో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ లలో దూసుకెళుతుందని భావిస్తున్నారు. ఈ వారం అన్ని డిజిటల్ ప్లాట్ ఫారమ్ థ్రిల్లర్ లే ఎక్కువ విడుదలవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగాను కొన్ని విడుదలలకు ప్రణాళికలు సాగుతున్నాయి. ఒక ప్రధాన మాదకద్రవ్యాల సామ్రాజ్యంలోకి చొరబడటానికి ఒక మాజీ పోలీసు ఇన్ ఫార్మర్ ని రప్పించాక.. ఆ చీకటి గతంతో ప్రమాదకరమైన సంబంధాలు ఎలా ముందుకు సాగాయి? అన్నదే ఈ సినిమా. రణదీప్ తో పాటు ఈ షోలో సువీందర్ విక్కీ -హర్లీన్ కౌర్ లతో సహా అద్భుతమైన తారాగణం ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘గాడ్స్ క్రూకెడ్ లైన్స్’ కూడా విడుదల అవుతుంది. Torcuato Luca de Tena రాసిన పేరులేని నవల ఆధారంగా, ఈ చిత్రం మరొక రోగి మరణాన్ని పరిశోధించడానికి మానసిక ఆసుపత్రిని తనిఖీ చేసే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ గురించిన కథాంశమిది. సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. దీని అసలు శీర్షిక లాస్ రెంగ్లోన్స్ టోర్సిడోస్ డి డియోస్.
డిసెంబర్ 7న నెట్ ఫ్లిక్స్ క్రిస్మస్ విడుదలను కూడా సిద్ధం చేసింది. ‘ఐ హేట్ క్రిస్మస్’ అనేది క్రిస్మస్ కు ముందు బాయ్‌ఫ్రెండ్‌ను వెతకడానికి ప్రయత్నిస్తున్న ఒక యువ స్వతంత్ర భావాల మగువ కథ. రొమాంటిక్ కామెడీలో పిలార్ ఫాగ్ టైల్ నటించారు.
డిసెంబర్ 9న `డిస్నీ+హాట్ స్టార్` లో ‘ఫాల్’ విడుదల కానుంది. ఇందులో అంజలి- ఎస్.పి.బి. చరణ్ నటీనటులు. బాల్కనీ నుంచి కారుపై పడి జ్ఞాపకశక్తి కోల్పోయిన ఓ అమ్మాయి కథే `పతనం`.
ఇవేగాక `వెల్ కమ్ టు చిప్పెండల్స్` కొత్త ఎపిసోడ్ ఎప్పటిలాగే బుధవారం నాడు స్ట్రీమ్ అవుతుంది. కుమైల్ నంజియాని హెడ్ లైన్ తో, ఒక భారతీయ వలసదారు ``మగాళ్ల స్ట్రిప్ క్లబ్`` ను ప్రారంభించాక ఏం జరిగింది? అనే అద్భుతమైన పాయింట్ తో రూపొందింది. సోనీలివ్ ఈ వారం తమిళ చిత్రం ‘సాక్షి’ ప్రపంచ ప్రీమియర్ ను ప్రదర్శించింది. ఇటీవల, OTT ప్లాట్‌ఫారమ్ ‘కైయుమ్ కలవుమ్’ -‘అనెల్ మేలే పానీ తూలి’తో మంచి తమిళ కంటెంట్ తో తెరకెక్కింది.
యాధృచ్ఛికంగా `అనెల్` కూడా నేరుగా OTTలో విడుదలైంది. `సాక్షి` మాన్యువల్ స్కావెంజర్ల సమస్యతో సాగే సాంఘిక నాటకం. ఈ చిత్రానికి దీపక్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా శ్రీనాథ్ - రోహిణి నటించారు.
సామాజిక ఇతివృత్తంతో ఉంటూ తదుపరి విడుదల నక్సలిజం- రొమాన్స్ సమస్యను మిళితం చేస్తుంది. ‘లైక్ చేయండి.. షేర్ చేయండి ..సబ్‌స్క్రైబ్ చేయండి’ అనేది ఇద్దరు ట్రావెల్ బ్లాగర్లు నక్సల్ - పోలీసుల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య తమను తాము కనుగొన్నప్పుడు వారి కథేమిటన్నదే సినిమా. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఓటీటీలో మరొక విడుదల #ఫాదు. ఇది ఒకదానికొకటి విరుద్ధంగా ఉండే రెండు పాత్రల మధ్య తీవ్రమైన ప్రేమకథగా హామీ ఇస్తుంది. ఇందులో సయామీ ఖేర్ కథానాయికగా నటిస్తోంది.
ప్రముఖ నటి తాప్సీ పన్ను Zee5లో `బ్లర్`తో నిర్మాతగా అడుగుపెట్టింది. డిసెంబర్ 9న విడుదలవుతున్న ఈ చిత్రం స్పానిష్ సినిమా ‘జూలియాస్ ఐస్’కి అధికారిక రీమేక్. ఈ సినిమాలో తాప్సీతో పాటు గుల్షన్ దేవయ్య- కృత్తికా దేశాయ్ నటిస్తున్నారు. Zee5 ఒరిజినల్, 'బ్లర్' అనేది క్షీణించిన కంటి రుగ్మతతో బాధపడుతున్న గాయత్రి కథ. అయితే ఆమె తన కవల సోదరి మరణం లో మిస్టరీని ఛేదించాలని ప్రయత్నిస్తుంది.