Begin typing your search above and press return to search.
అక్షయ్ పాట పై దర్శకుడి రచ్చ
By: Tupaki Desk | 7 July 2017 5:23 AM GMTఅక్షయ్ కుమార్ హీరోగా భూమి పెద్నేకర్ హీరోయిన్ గా ఆగష్టు 11 న విడుదలకబోతున్న సినిమా ‘టాయిలెట్.. ఏక్ ప్రేమ్ కథ’. హీరో ఇంటికి కొత్తగా వచ్చిన హీరోయిన్ కు ఒక వింత అనుభవం ఏర్పడుతుంది. హీరో ఇంటిలో టాయిలెట్లు ఉండవు. అందుకు ఆమె ఒక పెద్ద విప్లవమే ప్రారంబిస్తుంది. ఈ సినిమా పోస్టర్ కు - ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. కాకపోతే ఈ మధ్యనే ఒక పాట ట్రైలర్ విడుదల చేశారు ‘హన్స్ మత్ పగ్లీ’. ఈ పాట ఒక రాజిస్తాన్ సినిమాలోనిది అని మా సినిమాలో పాటను కాపీ కొట్టి వాడుకున్నారు అని సదరు సినిమా వారు కేసు పెట్టేశారు.
ఇప్పుడు అదే కేస్ ఇండియన్ ఫిల్మ్ అండ్ టివి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో నమోదు చేశారు ఆ సినిమా దర్శకుడు విపిన్ తివారీ. దీనికి వెంటనే ఒక వివరణ ఇవ్వాలని అక్షయ్ కు ఒక నోటిస్ పంపించారు IFTVPC. విపిన్ తివారీ వాదన ప్రకారం 'లాడ్లీ' అనే సినిమా ఏప్రిల్ 7న రాజస్తాన్ లో విడుదల చేశారు. ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ అనే విషయం పై ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో ఉన్న పాటలాగా ఉండే అచ్చమైన పాటను టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా’ లో మా అనుమతిలేకుండా వాడుకున్నారు అని చెబుతున్నాడు దర్శకుడు. ఈ విషయం పై IFTVPC వాళ్ళు కూడ మాకు సపోర్ట్ ఇచ్చారు అంటున్నాడు. అంతే కాకుండా సినిమాలో ఒక హోలీ ఫెస్టివల్ సీన్ కూడా కాపీ కొట్టినట్లు చెబుతున్నాడు. ఇంకా తివారీ వెంటనే ఆ సీన్స్ సినిమా నుండి తొలగించాలిని డిమాండ్ చేస్తున్నాడు. వారం గడువులో ఒక వివరణ కావాలట.
టాయ్లెట్ ఏక్ ప్రేమ్ కథా డైరెక్టర్ నీరజ్ పాండే, ప్రొడ్యూసర్లు దీని పై ఇంకా పూర్తి దృష్టి పెట్టినట్లులేదు. అయన వాళ్ళు అనుకుంటునట్లు అలా ఏమి లేవు అని చెబుతూ తొందరలో దానికి ఒక వివరణ ఇవ్వబోతున్నాం అని చెప్పినట్లు తెలుస్తోంది. మరో మూడు రోజులలో ఏదో ఒక వివరణ ఇవ్వవలిసి ఉంది అక్షయ్ కుమార్ టీమ్ నోటిస్ పంపించింది IFTVPC. మరీ ఈ జగడం ఇంకా ఎంతవరకు వెళ్ళి అగుతుందో చూడాలి. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లో అక్షయ్ కుమార్ ప్రేమ కోసం టాయ్లెట్ కట్టడం అటుంచి ఈ సమస్యను ఎలా గట్టెక్కిస్తాడో చూడాలి.