Begin typing your search above and press return to search.

టాలీ మేకర్స్ మారాల్సిన టైం ఇదే

By:  Tupaki Desk   |   11 May 2017 6:11 PM IST
టాలీ మేకర్స్ మారాల్సిన టైం ఇదే
X
బాలీవుడ్ మూవీ మేకర్స్ ఇప్పుడు టాలీవుడ్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి టీం సృష్టించిన సంచలనం వీరికి అంతు పట్టడం లేదు. వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ల మార్క్ ను బాహుబలి2 ఇంత తేలికగా దాటేస్తుందని ఎవరూ అనుకోలేదు.

అది కూడా ఎలాంటి ప్రచార గిమ్మిక్కులు లేకుండానే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఇంతటి ఘనకార్యం సాధించిన టాలీవుడ్ లో.. ప్రపంచం అంతా ఆసక్తిగా గమనిస్తున్న మన ఇండస్ట్రీలో.. ఇంకా కొన్ని పాత భావాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇంత జరిగినా టాలీవుడ్ కి ఇంకా కనీస గౌరవం ఇవ్వని హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. షూటింగ్ టైంలో ఏబీసీడీ అంటూ పెదాలు కలపడం.. ప్రెస్ మీట్స్ లో మొక్కుబడి మాటలతో సరిపుచ్చడం చేస్తుంటారు. ఇక తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ పేర్లు.. అరువు నామాలు చూస్తూనే ఉంటాం.

ఇక అసిస్టెంట్ డైరెక్టర్స్ ట్యాలెంట్ ను వాడుకునే మూస ధోరణి కూడా బాగా ఎక్కువగానే ఉంది. ఇలాంటి పాత భావాలకు ఇకనైనా చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ విధానాలు అంటే.. అవేమీ బెంచ్ మార్క్ లు కాదని బాహుబలి నిరూపించింది. మరి ఇకనైనా కొత్త ఆలోచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని నిర్మాతలు గుర్తిస్తారో లేదో చూడాలి.