Begin typing your search above and press return to search.
ఈ సమ్మర్ మనకి ఉగాది పచ్చడే
By: Tupaki Desk | 14 Jun 2016 11:30 AM GMTఏ సినీ ఇండస్ట్రీకయినా సమ్మర్ సీజన్ చాలా స్పెషల్. మూవీలో కంటెంట్ ఉంటే.. పెద్దగా కష్టపడకుండానే ఆడియన్స్ ను థియేటర్ బాట పట్టించచ్చు. ఆ ఆశతోనే ఈ సమ్మర్ లో పలు చిన్న, పెద్ద సినిమాలు సందడి చేశాయి. ఇండస్ట్రీ టాప్ హిట్స్ లో చోటు సంపాదించుకున్న సినిమాతో పాటు.. టాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కూడా ఈ వేసవి ఖాతాలో చేరిపోయాయి.
సమ్మర్ స్టార్టింగ్ నుంచి ఓ లుక్ వేస్తే.. ఏప్రిల్ 1న ఎటాక్, సావిత్రి వచ్చాయి. రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో.. ఆరంభంలోనే దెబ్బ తగిలింది. ఇక ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఫ్యాన్స్ ని ఆకట్టుకునేందుకు పవన్ చేసిన ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. దీంతో అతి పెద్ద ఫ్లాపుల లిస్ట్ లో చేరిపోయింది. అయితే, తొలిరోజే డిజాస్టర్ టాక్ వచ్చి కూడా ఫుల్ రన్ 52 కోట్ల వసూళ్లతో.. టాలీవుడ్ లో 50 కోట్ల వసూళ్లు దాటిన తొలి ఫ్లాప్ మూవీగా రికార్డ్ కొట్టింది. ఆ తర్వాత వారంలో ఈడో రకం ఆడో రకం అంటూ మంచు విష్ణు-రాజ్ తరుణ్ లు చేసిన కామెడీ హంగామాకు.. ఆడియన్స్ బాగానే కనెక్ట్ అయ్యారు.
ఏప్రిల్ 22న అల్లు అర్జున్-బోయపాటి కాంబినేషన్ లో సరైనోడు ఇండస్ట్రీ టాప్5 లిస్ట్ లో చేరిపోయింది. మాస్ మసాలాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేశారు. చాలాకాలం తర్వాత ఫిఫ్టీ డేస్ పోస్టర్లను చూపించిన సినిమా ఇది. ఏప్రిల్ చివరివారంలో రాజా చెయ్యి వేస్తే వచ్చినా.. ప్రేక్షకులు మాత్రం ఆ సినిమా హిట్ కి ఓ చెయ్యి వెయ్యలేకపోయారు. ఇక మే నెల మొదటి వారంలో డైరెక్ట్ మూవీ సుప్రీమ్, డబ్బింగ్ మూవీ 24లు వచ్చి సక్సెస్ సాధించాయి.
మే 13న బిచ్చగాడు విడుదలైనపుడు పెద్దగా పట్టించుకోని జనాలు.. మే 20న రిలీజ్ అయిన మహేష్ మూవీ బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత మాత్రం.. ఆదరించారు. మే నెల చివరివారంలో వచ్చిన రాయుడు తమిళ్ నేటివిటీ ఎక్కువగా ఉండడంతో.. మనోళ్లకు రుచించలేదు. ఇక సమ్మర్ సీజన్ ముగుస్తుండగా వచ్చిన త్రివిక్రమ్ మూవీ అ..ఆ.. సంచలన విజయం సాధించింది.
గతవారం వచ్చిన ఒక అమ్మాయి తప్ప మూవీలో అమ్మాయి తప్ప ఇంకే లేదనే కామెంట్స్ వచ్చాయి. రైట్ రైట్ కు ఆడియన్స్ రైట్ చెప్పలేదు. అలా కొన్ని హిట్లు, కొన్ని ఫట్లుతో ఈ సమ్మర్ ఉగాది పచ్చడిలా తయారైంది.