Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ : ప‌ని అడ‌గ‌టంలో నేను మొహ‌మాట ప‌డ‌ను

By:  Tupaki Desk   |   29 April 2020 11:15 AM GMT
ఎక్స్ క్లూసివ్ : ప‌ని అడ‌గ‌టంలో నేను మొహ‌మాట ప‌డ‌ను
X
* హాయ్ అజ‌య్ గారు, ఎలా ఉన్నారు...

హాయ్ అండీ, నేను బావున్నా కానీ అనుకోకుండా వ‌చ్చిన ఈ గ్యాప్ కి ఎడ్జెస్ట్ అవ్వ‌డానికి కొంత టైమ్ ప‌ట్టింది. ఇప్పుడు బాగానే ఉంది

* మీర‌నేది వ‌ర్క్ - సినిమాలు గురించేనా

అవునండి దాదాపు 20 ఏళ్లు, ఖుషీ ద‌గ్గ‌ర నుంచి మొద‌లు పెడితే మొన్న వ‌చ్చిన భీష్మ వ‌ర‌కు దాదాపు 200 సినిమాల్లో న‌టించాను, ఇన్నేళ్లు పని, షూటింగ్ తో బిజీ బిజీ, ఫ్యామిలీ లైఫ్ కి టైమ్ స్పెండ్ చేసిన‌ప్ప‌టికీ ఎక్క‌డో అసంతృప్తి, ఇప్పుడు ఓ క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసే అవ‌కాశం ఈ క్వారంటైన్ పిరియ‌డ్ తీసుకువ‌చ్చింది. పిల్లల‌తో బాగా ఎంజాయ్ చేస్తున్నా.

* ఈ 20 ఏళ్ల‌లో చాలా అప్ అండ్ డౌన్స్ చూసుంటారు, అయితే కెరీర్ తొలినాళ్ల‌లో వ‌చ్చిన క్యారెక్ట‌ర్ల‌కి ఇప్ప‌టికీ కొంత వ‌త్యాసం వ‌చ్చింది, ఎందుకంటారు

ఖుషి, విక్ర‌మార్కుడు త‌దిత‌ర సినిమాల్లో న‌టించే టైమ్ లో ఉన్న జెన‌రేష‌న్ పెద్ద‌వాళ్లు అయ్యేస‌రికి నా క్యారెక్ట‌ర్లు కూడా పెర‌గుతూ వ‌చ్చాయి. ఆ త‌రువాత ఇప్ప‌టి జెన‌రేష‌న్ లో చాలా మందికి అజ‌య్ అంటే తెలిక‌పోవ‌చ్చు, వీరికి తెలిసేలా సినిమాలు చేస్తూ, ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌తో పనిచేయాలి. ఆ గ్యాప్ ని ఫిల్ చేసే క్ర‌మంలోనే కొన్ని చిన్న పాత్ర‌లు కూడా చేయాల్సి వ‌స్తుంది, అయితే పాత్ర నిడివి త‌క్కువైన‌ప్ప‌టికి క‌థ‌లో దాని ప్ర‌భావం ఉంటేనే చేస్తున్నాను. ఉదాహ‌ర‌ణ‌కు రీసెంట్ గా నేనే భీష్మ‌లో పోషించిన పాత్ర‌నే తీసుకోండి. క‌థ మొత్తానికి చాలా కీల‌కం, హీరోని గెలిపించే క్యారెక్ట‌ర్ ఇది, అలానే దానికి కొంచెం కామెడీ ట‌చ్ ఇవ్వ‌డంతో బాగా ప‌డింది. సూటిగా చెప్పాలంటే మీరున్న‌ట్లుగా నా పాత్ర‌లో ఉన్న వ్య‌తాసాన్ని ఇప్ప‌టి జెన‌రేష‌న్ ఆడియెన్స్ కి ద‌గ్గ‌ర చేసేవి భీష్మ‌లో నేను పోషించిన పాత్ర‌లే అని బ‌లంగా న‌మ్ముతున్నా

* క‌రోనా క్రైసిస్ కార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీ మీద ప్ర‌భావం ఎక్కువ ప‌డ‌బోతుంది, దీని పై స్పంద‌న‌

జ‌న్మ‌కి ఒక సారి వ‌చ్చే ప‌రిస్థితి ఇది, అంటే సినిమా ఇండ‌స్ట్రీ అనే కాదు అంద‌రి పై ఈ క్రైసిస్ ప్ర‌భావం బాగా ప‌డుతుంది. అన్నిటికంటే ఎక్కువగా మెంట‌ల్ ప్రెజ‌ర్ తో స‌ఫ‌ర్ అవుతారు. ఇందులో ఎక్కువ టెన్ష‌న్ ఫ్యూచ‌ర్ గురించే, ఇక మ‌న సినిమా విష‌యానికొస్తే త‌క్కువ ప‌ర్యారిటీ ఉంటుంది. కానీ ఈ ఇండ‌స్ట్రీ లో ఎంతో మంది రోజు కూలీ తీసుకుని పనిచేసే కార్మికులు ఉన్నారు, వారి ప‌రిస్థితే బాగా దెబ్బ తినే అవ‌కాశం ఉంది. ప్రభుత్వం దృష్టిలో లీస్ట్ ప‌ర్యారిటీ సినిమా ఇండ‌స్ట్రీ కే ఉండ‌టం చాలా దుర‌దృష్ట‌క‌రం. మ‌నం రోజు వ‌ల‌స కూలీలు గురించి వార్త‌లు చూసి ఎలాగైతే బాధ‌ప‌డుతున్నామో, అంతే బాధ‌ని సినిమాలు మీదు ఆధార‌ప‌డి బ్ర‌తికే కార్మికులు ప‌డుతున్నారు. ఇంకాస్త గుర్తింపు ప్ర‌భుత్వం నుంచి వ‌స్తే ఈ ప‌రిస్థితి మెరుగుప‌డుతుంద‌ని నా అభిప్రాయం.

* ఇన్ని రోజులు బిజీగా గ‌డిపి స‌డెన్ గా ఆగిపోయే స‌రికి కొంత మెర మానసికంగా కృంగిపోయే అవ‌కాశం ఉంది, ఇది అంద‌రిలోను క‌లుగుతుంది. దీన్ని మీరు ఎలా అధిగ‌మిస్తున్నారు

మీ ఫ్యామిలీతో కుర్చొని టైమ్ స్పెండ్ చేస్తూ దేశ సేవ చేసే టైమ్ దొరికింది. ఇంట్లో కుర్చుంటే స‌ర్వీస్ చేసినట్లే. మొత్తం మాన‌వాళికి వ‌చ్చిన పెద్ద విప‌త్తు ఇది, ముందు దీని నుంచి బ‌య‌ట‌ప‌డితేనే ఫ్యూచ‌ర్ ఉంటుంది. మిగ‌తా విష‌యాలు గురించి ఆలోచించ‌కుండా ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లుగా న‌డుచుకుంటే భవిష్య‌త్తుని చూడ‌గ‌లం. మాన‌వాళి అన్నిటిని తొంద‌ర‌గా ఎడాప్ట్ చేసుకుంటుంది. చెట్లు, మ‌న‌షులు మాత్ర‌మే భూమికి అడ్డంగా ఎదిగారు. మీరు గ‌మ‌నిస్తే మిగ‌తా జంతువులు వెనుముక్క‌లు భూమీకి స‌మాంత‌రంగా ఉంటాయి. మ‌నం మాత్రం అడ్డంగా ఎదిగాము. సో ఇలాంటి వైరెస్ ను ఎన్నీ వ‌చ్చిన మ‌న‌ల్ని అడ్డుకోవ‌డం చాలా క‌ష్టం. అతి త్వ‌రలో ఈ క్రైసిస్ నుంచి బ‌య‌ట‌ ప‌డ‌తాము అని నా స్టాంగ్ ఫీలింగ్.

* ఆర్టీస్టుల్లో చాల మంది ఈగో సెంట్రిక్ ఉంటార‌నే వాద‌న ఉంది. అలాంటి వారితో మీరు ప‌ని చేసి ఉండొచ్చు, మిమ‌ల్ని కూడా కొంద‌రు అనుకోవ‌చ్చు, ఈ సంద‌ర్భాల్ని ఎలా అధిగ‌మిస్తున్నారు

సెల్ఫ్ ఎస్టీమ్ కి ఈగోకు మ‌ధ్య ఉండే గీత కంటికి క‌నిపంచ‌దు. బై గాడ్ గ్రేస్ నేను దాదాపు మూడు త‌రాల హీరోల‌తో న‌టించారు. ఇందులో కొత్త‌వారున్నారు, నాకంటే సీన‌య‌ర్లు ఉన్నారు. అయితే మ‌నం ఇండ‌స్ట్రీలోకి ఎలా అయితే ఉన్నామో వేళ్లే వ‌ర‌కు అలానే ఉండాలి అనే సిద్ధాంతాన్ని చాలా గట్టిగా న‌మ్ముతాను. ఈ ప్రాక్టీస్ కార‌ణంగా కొంత మంది నొచ్చుకొవ‌చ్చు, కొంద‌రు హ్యాపీగా ఫీల్ అవ్వ‌చ్చు. ఎవ‌రు ఏం అనుకున్నా మ‌న ప‌ద్ధతిలో మ‌నం కన్సిస్టెంట్ గా వెళితే మాత్రం మ‌నతో ప‌నిచేసే వారు మ‌న‌కు త‌గ్గ‌టే ప్ర‌వ‌ర్తిస్తారు. ఇదే కార‌ణంగా నా మీద ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి రిమార్క్ లేద‌ని నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్ప‌గ‌ల‌ను.

* ఓటీటీ ల ప్ర‌భావం సినిమాలు మీద ఏ విధంగా ప‌డుతుంద‌ని మీ అభిప్రాయం

ఓటీటీలు చూసే వారి సంఖ్య ఈ రెండు నెల‌లుగా 40 శాతం పెరిగి పోయింది. దీంతో క్రియేట‌ర్స్ కొత్త‌గా ఆలోచించాలి. క్వాలిటి కంటెంట్ మీద ఫోక‌స్ ఎక్కువు పెట్టాలి. కంటెంట్ లో కాంప్ర‌మైజ్ అయితే మాత్రం మొద‌టికే మోసం వ‌స్తుంది. అయితే థియేట‌ర్ కి వెళ్లే ఆడియెన్స్ శాతం కూడా ఏ మాత్రం త‌గ్గ‌ద‌ని నా అభిప్రాయం. ఎందుకంటే లార్జ్ స్క్రీన్ మీద సినిమాను చూసే ఎక్స్ పీరియ‌న్స్, గ్రూప్ వాచింగ్ మోమొంట్స్ ఇవ్వ‌న్ని కేవలం థియేట‌ర్ లోనే ఉంటాయి. సో ఓటీటీ కార‌ణంగా థియేట‌ర్స్ మీద తద్వారా సినిమాలు మీద నెగిటివ్ ప్ర‌భావం ప‌డే అవ‌కాశలు లేవు అని నా ఉద్దేశం.

* 2020 మొత్తం అజ‌య్ సినిమాల‌తో నిండిపోయినట్లుంది.

అయ్యో అదేం కాదండి, న‌న్ను త‌మ సినిమాల్లో పెట్టుక‌ని ఎంక‌రేజ్ చేస్తున్న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు, హీరోలు కార‌ణంగానే ఇది సాధ్యం అవుతుంది. చాలా హెల్తీ కాంపీటిష‌న్ లో సినిమా న‌డుస్తున్నాయి. నేను అల‌వైకుంఠ‌పురం షూటింగ్ టైమ్ లో ఉన్న‌ప్పుడు త్రివ‌క్ర‌మ్ గారికి చెప్పే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకి డేట్స్ ఎడ్జెస్ట్ చేశాను. అదే మాదిరిగా స‌రిలేరు షూటింగ్ లో అనిల్ గారిని అడిగే అల‌వైకుంఠ‌పురం షూటింగ్ కి హాజ‌రైయ్యాను. ఇందులో యాక్ట్ చేస్తున్నా అని అందులో నా పాత్ర త‌గ్గించేయ‌డం ఇలాంటి సంఘ‌ట‌ణ‌లు కేవలం అపోహ‌లు మాత్ర‌మే, ఇండ‌స్ట్రీలో అంతా ఒక్క‌టిగా బ్ర‌తుకుతున్నారు.

* పాత్ర‌లు మ‌న‌ల్ని వెతుక్కుంటూ రావు మ‌న‌మే పాత్ర‌ల్ని వెతుకుతూ వెళ్లాలి అనే స్టేట్మెంట్ పై మీ స్పంద‌న‌

నాకు ఏదైనా పాత్ర న‌చ్చితే నేను వెళ్లి ఆ డైరెక్ట‌ర్ ని క‌లిసి పాత్ర నేను చేస్తాను అని చెప్పి అందులో న‌టిస్తాను. స‌రిలేరు లో ఆ పాత్ర కావాల‌ని అనిల్ ని అడిగి మ‌రీ న‌టించాను. ఈ విష‌యంలో కొంద‌రు మొహ‌మాట ప‌డుతుంటారు. అవ‌కాశాలు కోసం తిరగడాన్ని ఓ త‌ప్పుగా, ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అయితే నేను మాత్రం ఆ విష‌యంలో మొహ‌మాట ప‌డ‌ను. ఎందుకంటే నేను ప‌ని అడుగుతున్నా అందులో త‌ప్పేం ఉంద‌ని నా ఫీలింగ్. ప్ర‌స్తుతం లాక్ డౌన్ త‌రువాత షూటింగ్స్ స్టార్ట్ అయితే కొన్ని సినిమాల‌కి సైన్ చేశాను. చిరంజీవిగారి 153 వ సినిమాలో కూడా న‌టించే అవ‌కాశం ల‌భించింది. ఆ ప్రాజెక్ట్ కోస‌మే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.

* మీకు మ‌రిన్ని మంచి పాత్ర‌లు ల‌భించాల‌ని, ఇదే విధంగా ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయాల‌ని మ‌నఃస్పూర్తిగా మా తుపాకీ టీమ్ కోరుకుంటుంది - ఆల్ ది బెస్ట్

తుపాకీ డాట్ కామ్ రీడ‌ర్స్ అంద‌రు సేఫ్ గా ఇంట్లోనే ఉండాల‌ని నా విన్న‌పం - ఆల్ ది బెస్ట్