Begin typing your search above and press return to search.
శ్రీకాంత్ కి సెకండ్ ఇన్నింగ్స్ కలిసి వచ్చేటట్లు లేదే?
By: Tupaki Desk | 23 Jan 2023 4:15 AM GMTఅప్పుడు తెలుగులో స్టార్ హీరోలుగా కొనసాగిన వారు ఇప్పుడు సినిమా అవకాశాలు లేక సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా కూడా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అలాంటి ప్రయత్నం చేసిన జగపతిబాబు ఒక రేంజ్ లో వర్కౌట్ చేసుకొని ప్రస్తుతం.. తమిళ, మలయాళ భాషల్లో కూడా విలన్ పాత్రలు చేస్తూ... రెండు చేతుల సంపాదిస్తున్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారదామని శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఏవి వర్కౌట్ అవ్వడం లేదు.
54 ఏళ్ల శ్రీకాంత్... యుద్ధం శరణం అనే సినిమాతో పూర్తిస్థాయి విలన్ గా మారాడు. ఆ తరువాత విలన్ అనే మలయాళ సినిమా ది విలన్ అనే కన్నడ సినిమాల్లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించాడు. ఆ తరువాత అఖండ సినిమాలో ఆయనకు పవర్ఫుల్ విలన్ పాత్ర పడింది. సినిమా కూడా హిట్ అయింది. అయినా ఇప్పటికీ ఆయనకు సరైన సక్సెస్ మాత్రం లభించలేదని చెప్పాలి. అఖండ సినిమాలో శ్రీకాంత్ విలనిజంతో పండిస్తాడు అనుకుంటే మరో విలన్ కింద పని చేస్తూ... ఆ క్రెడిట్ అంతా ఆయనకే ఇచ్చేశాడు. ఆ తర్వాత కూడా శ్రీకాంత్ కేవలం విలన్ పాత్రలకే పరిమితం అవుతాడు అనుకుంటే హీరో అన్నయ్య పాత్రలు కూడా చేస్తూ వస్తున్నాడు.
ఒకరకంగా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతిబాబు మాత్రమే క్లిక్ అయ్యాడని చెప్పాలి. ఆయనను చూసి అలాంటి ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న శ్రీకాంత్ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటే అది మాత్రం ఎంతకు వర్క్ అవుట్ అవ్వడం లేదు. ప్రస్తుతం ఆయన హంట్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నాడు.
ఈ సినిమా ద్వారా అయినా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే హీరో శ్రీకాంత్ తన కుమారుడిని హీరోగా నిలదొక్కుకునే ఒప్పుకునేలా అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. పెళ్లి సందడి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ట అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన కుమారుడికి సరైన సినిమా కూడా పడలేదు. శ్రీకాంత్ ఎప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ లో వర్క్ అవుట్ చేసుకుంటాడో చూడాలి.