Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో బావలు..బామర్దులు వీళ్లే!
By: Tupaki Desk | 12 May 2022 5:46 AM GMTసినిమా ఇండస్ర్టీలో వారసులే కాదు.. సినిమాల్లో సక్సెస్ అయిన ఫ్యామిలీల నుంచి కూడా యంగ్ స్టార్స్ హీరోలుగాల ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. ముందుగా ట్యాలెంట్ సంగతి పక్కనబెడితే పరిశ్రమలో ఎంటర్ అవ్వడం అన్నది అలాంటి వాళ్లకు వీజీగానే ఉంటుంది. సక్సెస్ అయిన వాళ్ల రిఫరెన్స్ తో వీజీగా ఎంట్రీ దొరికేస్తుంది.
ఆ తర్వాత నిలబెట్టుకోవడం అన్నది వాళ్ల ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఎంట్రీ కార్డు వరకూ ఎలాంటి ఇబ్బందులుండవు. అలా రంగప్రవేశం చేసి సక్సెస్ అయిన వాళ్లు కొంత మంది ఉండగా బ్రదర్స్ ఇంకొంత మంది... ఆ కోవలో చూస్తే టాలీవుడ్ లోకి బావలు-బామ్మర్దులు కూడా వస్తారు. ఓసారి ఆ వివరాల్లోకి వెళ్తే...
సూపర్ స్టార్ మహేష్ వరుసకి సుధీర్ బాబుకి బామ్మర్ది అవుతారు. మహేష్ సోదరి ప్రియదర్శినిని సుదీర్ బాబు 2006లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాతే సుదీర్ బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతకు ముందు వ్యాపారాలు చూసుకునే వారు. అలాగే అతను మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఆ రంగంలోకి వెళ్లాల్సిన సుధీర్ బాబు అనుకోకుండా సినిమాలవైపు వచ్చారు. ఎస్ ఎమ్మెస్ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి నితిన్ చంద్ర అనే బామ్మర్ది ఉన్నాడు. తారక్ భార్య లక్ష్మీ ప్రణతికి స్వయనా సోదరుడు. ఇప్పుడీ కుర్రాడు శ్రీ 'శ్రీ శ్రీ రాజావారు' అనే సినిమాతో రంగ ప్రవేశం చేస్తున్నాడు. 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - కళ్యాణ్ దేవికి బామ్మర్దే. చరణ్ సోదరి శ్రీజని కళ్యాణ్ దేవ్ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మామ చిరంజీవి టైటిల్ తోనే సినిమా చేసాడు. ఆ సినిమా పేరు 'విజేత'.
అలాగే యంగ్ హీరోలు రామ్ పోతినేని..శర్వానంద్ కూడా బామ్మర్ది- బావలు అవుతారు. రామ్ సిస్టర్ ని శర్వా అన్నయ్య పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా ఇద్దరు బంధువులే. అలాగే హీరో రిషీ అజిత్ కి బామ్మర్ది అవుతాడు. రిషి అజిత్ భార్య షాలినికి స్వయానా సోదరుడు. కొంచెం పాత తరంలోకి వెళ్తే నాగార్జున-వెంకటేష్ కూడా బావ బామ్మర్దులే.
వెంకటేష్ సోదరినే నాగ్ వివాహం చేసుకున్నారు. ఆ దంపతుల పుత్రుడే నాగచైతన్య. ఆ కారణంగా చైతన్య-రానా కూడా బావబామ్మర్దులే. మనస్పర్ధల కారణంగాల నాగార్జున విడిపోయారు. ఆ తర్వాత నాగ్ అమలని ప్రేమ వివాహం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి- అల్లు అరవింద్ బావబామ్మర్దుల ఆప్యాయత గురించి చెప్పాల్సిన పనిలేదు.
సురేఖ స్వయనా అరవింద్ కి సోదరి. ఇక ఎన్టీఆర్..కళ్యాణ్ రామ్ లకు వరుసకు నారా రోహిత్ బావ అవుతారు. ఒకప్పుడు నటుడిగా బిజీగా ఉన్న రోహిత్ ఇప్పుడు సినిమాలు తగ్గించాడు. ఇక మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు. చిరంజీవి చెల్లెలు బిడ్డలు సాయితేజ్..వైష్ణవ్ తేజ్.. బన్నీ..శిరీష్ లు- చరణ్..వరుణ్ తేజ్ లు బావబామ్మర్దులే. మెగాస్టార్ నాటిన చెట్టుకింద వీరంతా సేద తీరుతున్నవారే.