Begin typing your search above and press return to search.

కవచ కుండలం తీయడం కష్టమే సుమతీ

By:  Tupaki Desk   |   31 Oct 2015 1:00 AM IST
కవచ కుండలం తీయడం కష్టమే సుమతీ
X
హీరోయిన్స్ అంటే అందాల తారలు. ఇది అందరికీ తెలిసిన నిజం. కానీ అందరికీ తెలియని, కొందరికే తెలిసిన నిజం ఏంటంటే అవన్నీ ఆన్ స్క్రీన్ అందాలే అని. తెరపై అంత అందంగా - సుందరంగా - ముగ్ధ మనోహరంగా వయ్యారాలు ఒలికించే ముద్దుగుమ్మల బ్యూటీ సీక్రెట్.. మేకప్. ఇది లేకపోతే కొందరు ప్రఖ్యాత హీరోయిన్స్ ని గుర్తు పట్టడం కూడా కష్టమే.

అంతా మేకప్ మెన్ - కెమేరామెన్ గొప్పదనం అనడం కాదు కానీ.. మేకప్ లేకుండా తాము ఎలా ఉంటామో చూపించేందుకు ఇష్టపడకపోవడమే అసలు విషయం. చెప్పడానికేమో చాలానే కబుర్లు చెప్పేస్తారు. ఇఫ్పుడు సోషల్ నెట్వర్కింగ్ వచ్చాక.. బోలెడు ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ సరదాలు - సంతోషాలను ఫోటోల రూపంలో పంచుకునేందుకు సెలబ్రిటీలు ఏమాత్రం వెనుకాడ్డం లేదు. అయితే.. వీటిలోనూ మేకప్ మొహాలే దర్శనమిస్తున్నాయి. మహేష్ బాబు పోకిరీ మూవీలో ఓ సీన్ ఉంటుంది. ఇలియానా ఇంత లావున మేకప్ వేసుకొచ్చి.. అది జస్ట్ క్రీం అంటుంది. అలాగే ఉంటుంది తారల యవ్వారం.

ఒకవేళ మేకప్ లేకుండా ఉన్న ఫోటోలను షేర్ చేయాల్సి వస్తే.. ఇమ్మీడియెట్ గా స్మార్ట్ ఫోన్ లో కలర్ కరెక్షన్ యాప్ తో రంగులు మిక్స్ చేసి, ఫేస్ ని స్మూత్ గా మార్చేసుకుని... నున్నగా తయారైన ఫోటోలనే షేర్ చేస్తున్నారు. ఇలా టెక్నాలజీ వాడకం విషయంలో శృతిహాసన్ కి ఫస్ట్ ర్యాంక్ ఇవ్చచ్చు. తమన్నా - త్రిషలు యవ్వారం కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడున్న టాప్ హీరోయిన్లలో సమంత ఒక్కతే.. ఏ మేకప్ లేకుండానే తన ఫోటోని షేర్ చేయగల ధీర వనిత అని చెప్పచ్చు.