Begin typing your search above and press return to search.
ఫుల్ జోష్ తో క్రేజీ స్టార్స్ సెకండ్ ఇన్నింగ్స్
By: Tupaki Desk | 11 May 2022 1:30 AM GMTవెండితెరపై తమదైన నటనతో ఆకట్టుకున్న క్రేజీ తారలు అర్థాంతరంగా కెరీర్ కి బ్రేకిచ్చేస్తే అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. మళ్లీ మనం మెచ్చిన తార వెండితెరపై కనిపించదా? అని ఆరాతీస్తుంటారు. అయితే అలాంటి తారలే మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే వారిని అభిమానించే ప్రేక్షకుల్లో వుండే ఆనందం మాటల్లో చెప్పలేం. ఇదే ఆనందాన్ని అందించడానికి గత కొంత కాలంగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన క్రేజీ తారలంతా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు. తమ అభిమానుల కోసం మళ్లీ నట ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. వాళ్లెవరు. ఆ కథేంటో ఒకసారి చూద్దాం.
బి. నరసింగరావు తెరకెక్కించిన 'దాసి' చిత్రంతో జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న నటి అర్చన. 1988లో విడుదలైన ఈ చిత్రంలో పలు అవార్డలతో పాటు ఉత్తమ నటిగా ప్రశంసల్ని సొంతం చేసుకుంది. తమిళ చిత్రం 'వీడు' ద్వారా కూడా జాతీయ ఉత్తమ నటిగా అవార్డుని సొంతం చేసుకున్న అర్జన .. భానుచందర్ నటించిన నిరీక్షణ, రాజేంద్ర ప్రసాద్ చేసిన 'లేడీస్ టైలర్', వినోద్ కుమార్ నటించిన 'భారత్ బంద్ వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తరువాత సినిమాకు బ్రేకిచ్చింది. 28 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా వున్న ఆమె మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.
పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా జీవన్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న చిత్రం 'చోకర్ బజార్'. ఈ మూవీతో అర్చన 28 ఏళ్ల విరామం తరువాత మళ్లీ రీఎంట్రీ ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది. ఇందులో అర్చన .. ఆకాష్ పూరికి తల్లిగా కనిపించబోతోంది. హైదరాబాద్‌లోని చోర్ బజార్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో అర్చనకు తెలుగులో మరిన్నిఅవకాశాలు దక్కుతాయోమో చూడాలి. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన అక్కినేని అమల ఆ మధ్య శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. కానీ ఆమె నటించదగ్గ పాత్రలు రాకపోవడంతో చాలా ఏళ్లుగా సినిమాలు చేయడం లేదు.
తెలుగులో కంటే తమిళంలోనే అత్యధిక చిత్రాల్లో నటించిన అమల 1993 లో డా. రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన 'ఆగ్రహం' మూవీ తరువాత తెలుగు సినిమాల్లో కనిపించలేదు. సినిమాకు బ్రేక్ ఇచ్చారు. అయితే ఇక ఆమె సినిమాకు శాశ్వతంగా దూరమైనట్టే అనే వార్తలు కూడా వినిపించాయి. అయితే దాదాపు కొన్నేళ్ల విరామం తరువాత 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'లో నటించినా అది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. చిన్న అతిథి పాత్ర అందకే అమల సెకండ్ ఇన్నింగ్స్ గా ఆ సినిమాని పరిగణలోకి తీసుకోలేదు. అయితే పదేళ్ల విరామం తరువాత మళ్లీ ఆమె శర్వానంద్ నటించిన బైలింగ్వల్ మూవీ 'ఒకే ఒక జీవితం' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు.
టైమ్ మెషీన్ లాంటి కథతో తెరకెక్కుతున్న ఈ మూవీతో అమల శర్వాకు తల్లిగా కనిపించబోతున్నారు. పేరుకి అతిథి పాత్రలానే అనిపించినా పుల్ లెగ్త్ గా సాగుతుందని తెలుస్తోంది. ఇదే చిత్రాన్ని తమిళంలో 'కణం' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇరవై ఏళ్ల తరువాత తమిళంలో అక్కినేని అమల చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇక 'బద్రీ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్ ఆ తరువాత 'జానీ' సినిమాతో ఆకట్టుకున్నారు. ఈ రెండు చిత్రాలు పవన్ కల్యాణ్ తో చేసిన రేణు దేశాయ్ ఆ తరువాత ఆయననే వివాహం చేసుకుని సినిమాకు గుడ్ బై చెప్పారు.
2014లో మరాఠీ ఫిల్మ్'ఇష్క్ వాలా లవ్' సినిమాతో డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మళ్లీ ఇరవైఏళ్ల విరామం తరువాత మళ్లీ కెమెరా ముందుకు నటిగా రాబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. వంశీ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ మూవీ పాన్ ఇండిమా స్థాయిలో విడుదల కాబోతోంది.
'బొమ్మరిల్లు' చిత్రంతో హ హా హాసిని అంటూ తనదైన శైలిలో ఆకట్టుకున్న జెనీలియా తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. 2012లో రానా హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'నా ఇష్టం' సినిమాతో టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించి పెళ్లాడింది. వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న జెనీలియా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. పదేళ్ల విరామం తరువాత జెనీలియా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. గాలి జనార్థన్ రెడ్డి తనయుడు హీరోగా పరిచయం అవుతున్న సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే మొదలైంది.
హీరోయిన్ గా మంచి పేరుతో పాటు క్రేజ్ ని సొంతం చేసుకున్న కలర్స్ స్వాతి చాలా ఏళ్లుగా సినిమాలకు దూరంగా వుంటూ వస్తోంది. 2017లో వచ్చిన 'లండన్ బాబులు' సినిమా తరువాత నటనకు గుడ్ బై చెప్పేసింది. అయితే ఆ మళ్లీ ఏమనుకుందో ఏమో గానీ తెలుగు అంథాలజీ 'పంచతంత్రం' చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది. డా. బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ రిలీజ్ కావాల్సి వుంది. తాజాగా 'ఇడియట్స్' మూవీని కూడా అంగీకరించింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. వీళ్లతో పాటు మీరా జాస్మిన్ కూడా మళ్లీ తెలుగులో రీఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
రామ్ హీరోగా బోయపాటి శ్రీను ఓ భారీ చిత్రాన్ని చేయబోతున్నారు. ఆ చిత్రం ద్వారా మీరా జాస్మిన్ రీఎంట్రీకి రెడీ అయిపోయింది. అలాగే సొనాలి బెంద్రే కూడా ఎన్టీఆర్ - కొరటాల మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చాలా ఏళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తున్న వీరు మళ్లీ బిజీగా కావాలని, మరిన్ని మంచయి చిత్రాల్లో నటించాలని ఆశిద్దాం.