Begin typing your search above and press return to search.
ఈ హాటీలపై గాసిప్స్ రాయకండే...
By: Tupaki Desk | 11 Jun 2015 5:30 PM GMTసెలబ్రిటీలపై రూమర్స్ చాలా సహజం. కథానాయికల విషయంలో లింకప్ వార్తలు, ప్యాకప్ వార్తలు, చిలౌట్ న్యూస్ అంటూ గాసిప్‌రాయుళ్లు రకరకాలుగా ప్రచారం చేసేస్తుంటారు. వీటికి సదరు భామలు అతిగా స్పందిస్తే లాభం ఉండదు. సీరియస్ అయితే తిరిగి తమకే నష్టం. చినిగి చాటంత అవుతుంది. అందుకే ఇటీవలి కాలంలో కథానాయికలు గాసిప్స్‌ని మరీ అంత సీరియస్‌గా తీసుకోవడం మానేశారు. అలా ప్రచారం చేయొద్దు అని సున్నితంగా వివరణ ఇచ్చుకుంటున్నారు. అలాంటి ఓ ఐదు ఘటనల గురించి ఓ మారు తరచి చూస్తే..
అమలాపాల్:
ఈ భామ ఎ.ఎల్.విజయ్‌ని వివాహమాడి బుద్ధిగా కాపురం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఓ ఔత్సాహిక జర్నలిస్ట్ అమలా గురించి ఇష్టం వచ్చినట్టు రాసేశాడు. అమలా ప్రస్తుతం గర్భవతి. త్వరలోనే ప్రసవం అని ప్రచారం చేసేశాడు. దీనికి అమలా తర్వాత క్లారిటీ ఇవ్వాల్సొచ్చింది. ఇప్పటికే మీడియా చాలా కంగారు పడిపోతోంది. ఇప్పటికే రెండుసార్లు ఇలాంటి ప్రచారం చేశారు. మీరు మరీ అంత తొందరపడనక్కర్లేదు. ఏదైనా ఉంటే నేనే పిలిచి చెబుతా.. అని చెప్పింది అమలా.
అంజలి:
తెలుగింటి సీతమ్మ అంజలి పెళ్లాడేసింది. ఇప్పటికే బిడ్డను కూడా కన్నది అంటూ ఓ ఫోటో ఒకటి ముద్రించి మరీ ప్రచారం చేశారు. అయితే దీనికి అంజలి సమాధానం చెప్పుకోవాల్సొచ్చింది. అయ్యా ఆ ఫోటోలో ఉన్నది నా కజిన్ బిడ్డ. నా బిడ్డ కాదు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. పిల్లలు అసలే లేరు.. దిస్ ఈజ్ టూమచ్ అంటూ కాస్త కోపంగానే అంది.
తాప్సీ:
తాప్సీపై ఇటీవలి కాలంలో బోలెడంత ప్రచారమైంది. బ్యాడ్మింటన్ ఆటగాడు మాత్యూ బోని పెళ్లాడేసిందని రూమర్ పుట్టుకొచ్చింది. అతడు కనిపించనిదే పిచ్చెక్కిపోతున్న తాప్సీ తట్టుకోలేకపోయిందని రాసేశారు. నాకు పెళ్లయ్యిందని, పిల్లలు పుట్టేశారని నాకు తెలియదు లెండి.. అంటూ వ్యంగ్యంగా చురక వేసింది అమ్మడు.
లక్ష్మీమీనన్:
కోలీవుడ్ నాయిక లక్ష్మీపై ఇటీవలే విచిత్రమైన వదంతులు పుట్టుకొచ్చాయి. ఈ భామ పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైందంటూ ప్రచారం చేసేశారు. అయితే నేను రాసింది మెట్రిక్యులేషన్ కాదు బాబోయ్. ఫలితం వచ్చేముందు ఏంటి ఈ పుకార్లు? దయచేసి మానేయండి. నేను ప్లస్ 2 పరీక్షలు రాశా. ఫలితం వచ్చింది. డిస్టింక్షన్లో పాసయ్యాను.. అని విన్నవించింది.
నయన్:
ప్రస్తుతం ఈ భామ ఓ హారర్ చిత్రంలో నటిస్తోంది. ఆ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌ని సీక్రెట్‌గా ఓ చర్చిలో పెళ్లాడేసింది అంటూ ప్రచారమైంది. తర్వాత అలాంటి అవకాశమే లేదని నయన్ చెప్పుకొచ్చింది.