Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: టాలీవుడ్ నటికి మాఫియా డాన్ తో సంబంధాలు..!
By: Tupaki Desk | 4 Jan 2021 3:03 PM GMTదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులో టాలీవుడ్ యువ నటి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. జనవరి 2న ముంబై లోని ఒక హోటల్ లో డ్రగ్స్ పెడ్లర్లు మహ్మద్ చాంద్ పాషా - సప్లయర్ సయ్యద్ లతో సహా ఆమెను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చాంద్ పాషా నుంచి 400 గ్రాముల డ్రగ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఇచ్చిన సమాచారంతో పలు చోట్ల దాడులు జరిపి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఇక హైదరాబాద్ కు చెందిన మహ్మద్ చాంద్ - సయ్యద్ తో టాలీవుడ్ నటికి ఉన్న సంబంధాలపై ఎన్సీబీ ఆరా తీయగా మాఫియా కోణం బయటపడింది.
డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ నటికి మాఫియా డాన్ కరీంలాలాతో సంబంధాలున్నట్లు ఎన్సీబీ గుర్తించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావించి డాన్ కరీం లాలా కోసం దేశవ్యాప్తంగా అధికారులు గాలింపు చేపట్టారు. అతను దేశం విడిచి పెట్టి వెళ్ళకుండా లుక్ ఔట్ నోటీసు జారీ చేసి, అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ఇదిలా వుండగా డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ యువ నటి సోమవారం ఉదయం హడావిడి చేసింది. ఎన్సీబీ అధికారుల కళ్లు గప్పి కస్టడీలోని హోటల్ నుంచి తప్పించుకు పారిపోయింది. అయితే ఆమె మధ్యాహ్ననికి హోటల్ కు వచ్చి మళ్ళీ విచారణకు హాజరవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, నిందితురాలు తెలుగులో నాలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించినట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసు విచారణలో ఆమె నుంచి ఎన్సీబీ అధికారులు మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉంది.