Begin typing your search above and press return to search.
ఈ ఫ్లాప్స్ మంచివి కాదమ్మాయిలు!
By: Tupaki Desk | 18 Sep 2022 12:30 PM GMTసౌత్ సినిమా ఇండస్ట్రీలో గత కొంతకాలంగా భారీ స్థాయిలో రెమ్యునరేషన్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న ముగ్గురు హీరోయిన్స్ ఇటీవల మాత్రం ఊహించిన విధంగా వరుసగా అపజయలను ఎదుర్కొంటున్నారు. వారు మరెవరో కాదు మహానటి సినిమాతో జీవితానికి సరిపడేంత గుర్తింపు అందుకున్న కీర్తి సురేష్ తో పాటు ఉప్పెనతో యువతకు బాగా కనెక్ట్ అయిపోయిన కీర్తి సురేష్ కూడా వరుస డిజాస్టర్లతో సతమతమవుతోంది. మరోవైపు గ్లామరస్ బ్యూటీ పూజా హెగ్డే కూడా పెద్ద సినిమాలతోనే చాలా దారుణమైన ఫలితాలను చూడాల్సి వస్తుంది.
కీర్తి సురేష్ అయితే బ్యాక్ టూ బ్యాక్ 6 డిజాస్టర్స్ చూసింది. మొదటి నుంచి కూడా తన ప్రతి సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే నటించడానికి ఒప్పుకుంటూ వస్తోంది. అయితే మహానటి సినిమా తర్వాత అమ్మడు సరైన సక్సెస్ చేసింది లేదు. మహానటి తర్వాత చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా, సఖి మూడు సినిమాలు కూడా ఓటీటీ లోనే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలకు అనుకున్నంతగా హైప్ లేకపోవడంతో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోనే విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలు ఏవీ పూర్తిస్థాయిలో మెప్పించలేదు. ఇక రజనీకాంత్ తో నటించిన పెద్దన్న సినిమా కూడా అప్సెట్ చేసింది. ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా పూర్తిస్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది.
మరోవైపు ఉప్పెన సినిమాతో ట్రాక్లోకి వచ్చిన కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు సినిమాతోనే కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంది. ఇక తర్వాత చేసిన కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిల పడ్డాయి. మాచర్ల నియోజకవర్గం - ది వారియర్ సినిమాల ఫలితాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా వచ్చిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మొదటి రోజే నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియా కూడా అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్స్లలో పూజ హెగ్డే టాప్ లిస్టులో కొనసాగింది. అయితే ఈ బ్యూటీ ఎన్నో ఆశలు పెట్టుకున్న 3 పెద్ద సినిమాలు తీవ్రంగా నిరాశపరుచాయి. ముఖ్యంగా విజయ్ బీస్ట్ సినిమాతో పాటు రాధే శ్యామ్ రెండు కూడా ఫ్లాప్ అయ్యాయి. అలాగే మెగా మల్టీస్టారర్ 'ఆచార్య' కూడా మరో డిజాస్టర్ గా నిలిచింది. ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు హీరోయిన్లు మొదట్లో ఊహించని స్థాయిలో క్రేజ్ అందుకొని మళ్లీ ఆ వెంటనే వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నారు. మరి తదుపరి సినిమాలతో అయినా ఫామ్ లోకి వస్తారో లేదా చూడాలి.