Begin typing your search above and press return to search.

కెజిఎఫ్ 2కి తెలుగు ముద్ర వేస్తున్నారు

By:  Tupaki Desk   |   16 May 2019 6:07 AM GMT
కెజిఎఫ్ 2కి తెలుగు ముద్ర వేస్తున్నారు
X
కెజిఎఫ్ చాప్టర్ 1 ఊహించని రేంజ్ లో అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలవడం ఇప్పుడు సీక్వెల్ తీసే విషయంలో ఎన్నో జాగ్రత్తలు వహించేలా చేస్తోంది. అందుకే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా అందరు నటీనటులు బాలన్స్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. హిందీ నుంచి ఇప్పటికే సంజయ్ దత్ రవీనాటాండన్ లు టీమ్ లో రాగా తెలుగు నుంచి రావు రమేష్ ని ఎంచుకున్నట్టు తెలిసింది.

ఆగస్ట్ నుంచి ఈయన షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మొదటి భాగం మొత్తం కన్నడ యాక్టర్స్ తోనే నిండిపోయింది. ఎవరూ పరిచయం ఉన్నవారు కాకపోయినా సబ్జెక్టులో ఉన్న ఇంటెన్సిటీ మనవాళ్ళను మెప్పించడంతో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈసారి అన్ని బాషాల నుంచి తారాగణాన్ని తీసుకుంటే మార్కెట్ పరంగా ఇంకా హెల్ప్ అవుతుందన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది

ఇన్ సైడ్ టాక్ ప్రకారం రావు రమేష్ ఇందులో హీరో యష్ పోషించిన రాఖీ భాయ్ పాత్రకు వ్యతిరేకంగా కోర్టులో వాదించే లాయర్ గా కనిపించబోతున్నట్టు తెలిసింది. కీలకమైన మార్పులకు కారణం అయ్యే ఈ రోల్ చాలా ఎగ్జైటింగ్ గా ఉండటంతో పాటు శాండల్ వుడ్ ఎంట్రీకి మంచి ఆప్షన్ గా నిలుస్తుందనే ఉద్దేశంతో రావు రమేష్ ఓకే చెప్పినట్టు సమాచారం.

తమిళ్ నుంచి సైతం సత్యరాజ్ లాంటి సీనియర్లను ఇందులోకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు దర్శకడు ప్రశాంత్ నీల్. ఒకపక్క షూటింగ్ జరుగుతూ ఉండగానే ఇంకా క్యాస్టింగ్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. వచ్చే ఏడాది విడుదల కానున్న కెజిఎఫ్ 2 సౌత్ లో అత్యధిక బిజినెస్ జరుపుకోబోయే సినిమాల్లో ఒకటిగా ఇప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్ ల ఉన్నాయి