Begin typing your search above and press return to search.

కేర‌ళ బాధితుల‌కు 'మా' విరాళం!

By:  Tupaki Desk   |   18 Aug 2018 5:03 PM GMT
కేర‌ళ బాధితుల‌కు మా విరాళం!
X
గ‌త 9 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు - వరదల కారణంగా అత‌లాకుత‌లమవుతోన్న త‌మ‌ రాష్ట్రాన్ని ఆదుకోవాల‌ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు స్పందించి కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీగా విరాళాలు అంద‌జేస్తోన్న సంగ‌తి తెలిసిందే. మాలీవుడ్‌ - కోలీవుడ్‌ - టాలీవుడ్ ప్రముఖులు పొరుగు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆప‌న్న హ‌స్తం అందించేందుకు ముందుకు వ‌చ్చారు. తమకు తోచిన మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా అందించారు. ఈ రోజు తమిళ స్టార్‌ హీరో - ఇళయ దళపతి విజయ్‌ కేరళ వరద బాధితుల స‌హాయార్థం 14 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని అందించారు. తాజాగా, కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్(మా) రూ.2కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించింది. వ‌ర‌దలు వంటి విప‌త్తులు సంభ‌వించిన‌పుడు...బాధితుల‌కు సాయం చేసేందుకు మా ఎల్ల‌పుడు ముందుంటుంద‌ని అధ్య‌క్షుడు శివాజీ రాజా అన్నారు.

కేర‌ళ వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం `మా` విరాళాల‌ను సేక‌రించింది. టాలీవుడ్ కు చెందిన ప‌లువురు న‌టీన‌టులు - ఆర్టిస్టులు - టెక్నీషియ‌న్లు ...త‌మ వంతు సాయాన్ని `మా`కు అంద‌జేశారు. ఈ క్ర‌మంలోనే దాదాపు రూ.2కోట్ల విరాళాలు వ‌సూల‌య్యాయి. వ‌ర‌ద బాధితుల‌కు త‌మ వంతు సాయం అందించిన ప్ర‌తి ఒక్క‌రికీ శివాజీ రాజా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అంత‌కుముందు వ్య‌క్తిగ‌తంగా విరాళాలు అందించిన హీరోలు - న‌టీన‌టుల‌కు కూడా శివాజీ రాజా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కాగా, అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌ (AMMA) రెండు విడతల్లో 50 లక్షలను కేర‌ళ సీఎంఆర్ ఎఫ్ కు అందించింది. మ‌రోవైపు - కోలీవుడ్ నటుడు క‌మ‌ల్ హాస‌న్ 25 ల‌క్ష‌లు - కార్తీ-సూర్య 25 ల‌క్ష‌లు - విజయ్‌ సేతుపతి 25 ల‌క్ష‌లు - సూర్య ప్రత్యేకంగా ‘AMMA’ ఫండ్‌ కు 10 లక్షలు - సిద్ధార్థ్ 10ల‌క్ష‌లు - ధనుష్‌ 15 లక్షలు - విశాల్ 10ల‌క్ష‌లు - శివకార్తికేయన్‌ 10 లక్షలు. మోహన్‌ లాల్ 25 ల‌క్ష‌లు - మమ్ముట్టి రూ.25 లక్షలు - ప్ర‌భాస్ కోటి రూపాయ‌లు(అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు) - అల్లు అర్జున్ 25ల‌క్ష‌లు - రామ్ చ‌ర‌ణ్ 60 ల‌క్షలు - ఉపాస‌న 1.2 కోట్లు - కొర‌టాల శివ 3 ల‌క్ష‌లు - విజ‌య్ దేవ‌రకొండ 5 ల‌క్ష‌లు - రామ్ 5 ల‌క్ష‌లు ...కేర‌ళ సీఎంఆర్ ఎఫ్ కు డొనేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. గీత గోవిందం’ సినిమా వసూళ్లను సీఎంఆర్ ఎఫ్ కు విరాళంగా అందిస్తామని చిత్ర నిర్మాత బన్నీ వాసు తెలిపిన విష‌యం తెలిసిందే.