Begin typing your search above and press return to search.

సెలబ్రిటీలు చుట్టూ ఉన్నా కమిట్ కాని తలసాని!

By:  Tupaki Desk   |   22 May 2020 6:15 AM GMT
సెలబ్రిటీలు చుట్టూ ఉన్నా కమిట్ కాని తలసాని!
X
చిరంజీవి.. నాగార్జున.. అల్లు అరవింద్.. దిల్ రాజు.. రాజమౌళి.. త్రివిక్రమ్.. కొరటాల శివ.. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 35 మంది టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు ఒకేచోట సమావేశమయ్యారు. చిరంజీవి నివాసంలో జరిగిన ఈ సమావేశం గురించి ఇప్పటికే బోలెడన్ని వార్తలు వచ్చి ఉంటాయి. అందరూ ఆ సమావేశం జరిగిన తీరును.. అందులో చర్చించిన అంశాల్ని.. మంత్రి తలసాని మాటల్ని మాత్రమే మాట్లాడారు. కానీ.. ఈ మీటింగ్ వెనుక లెక్కలు మాత్రమే కాదు.. మంత్రి తలసాని సామర్థ్యం ఏమిటన్నది ఇప్పుడు అందరికి అర్థమయ్యేలా చేసింది. సాధారణంగా తెలంగాణ రాష్ట్రంలో ఏం చేయాలన్నా కేసీఆర్ ప్రధానకేంద్రంగా మాత్రమే పనులు జరుగుతాయి.

చివరకు ప్రముఖులతో సమావేశాలంటే తనకు కుదరకుంటే.. తన కుమారుడు కేటీఆర్ కనుసన్నల్లో మీటింగ్ జరిగేలా ఉంటాయి. అందుకు భిన్నంగా టాలీవుడ్ కు చెందిన 35 మంది ప్రముఖులు మంత్రి తలసానిని ఆహ్వానించటం.. తమకు ఎదురవుతున్న సమస్యల్ని ఏకరువు పెట్టారు. తన చుట్టూ అంతమంది సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ ఏ సందర్భంలోనూ తలసాని టెంప్టు కాలేదని చెప్పాలి. తలసాని నోటి నుంచి ఏదో ఒక మాట చెప్పించాలని టాలీవుడ్ ప్రముఖులంతా ఒక్కచోట చేరినప్పటికీ.. వారు అనుకున్నట్లుగా మంత్రి తలసాని అస్సలు కమిట్ కాలేదని చెబుతున్నారు.

తమ కష్టాల్ని ఏకరువు పెట్టిన సినీ ప్రముఖులకు మంత్రి తలసాని తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. షూటింగ్ ల విషయం మొదలుకొని తన ముందు పెట్టిన సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తానని.. ఆయన సూచనల మేరకు చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. టాలీవుడ్ ను డిసైడ్ చేసే ప్రముఖులు ముఖ్యమంత్రితో కాకుండా.. మంత్రితో సమావేశం కావటం చూసినప్పుడు మంత్రి తలసాని తెలివి ఎంతన్నది అర్థం కాక మానదు.

ఇదిలా ఉంటే.. ఇంతమంది టాలీవుడ్ ప్రముఖులు ఒకచోట హాజరుకావటం అంటే.. సాధారణంగా ఇలాంటి మీటింగ్ లు ముఖ్యమంత్రి సమక్షంలో జరుగుతాయి. కానీ.. అందుకు భిన్నంగా మంత్రి తలసాని దగ్గర చర్చలు జరపటం గమనార్హం. ఇదంతా చూస్తే తలసాని రేంజ్ ఏమిటో అర్థం కాక మానదు.

టాలీవుడ్ పవర్ ఫుల్ సెలబ్రిటీలు కలిసి తమ మాటలతో మంత్రి తలసానిని ప్రభావితం చేయటంలో ఫెయిల్ అయ్యారని చెప్పక తప్పదు. ఎప్పుడు ఎలా రియాక్టు కావాలి? ఏ విషయంలో ఎంతమేర తనకు సీన్ ఉందన్న విషయం తలసానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో? ఇదే.. ఆయనకు కేసీఆర్ మరింత స్వేచ్ఛ ఇచ్చేందుకు కారణమైందని చెప్పక తప్పదు.