Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ప‌క్క చూపు! మ్యూజిక్ అద్దెకు తేవాలా!?

By:  Tupaki Desk   |   7 Nov 2019 5:49 AM GMT
టాలీవుడ్ ప‌క్క చూపు! మ్యూజిక్ అద్దెకు తేవాలా!?
X
తెలుగు లో సంగీత ద‌ర్శ‌కుల కొర‌త కొట్టొచ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. పేరున్న సంగీత ద‌ర్శ‌కులు అతి కొద్ది మందే మ‌న‌కు ఉన్నారు. కీర‌వాణి.. మ‌ణిశ‌ర్మ లాంటి సీనియ‌ర్ సంగీత ద‌ర్శ‌కులు ఉన్నా అన్ని సినిమాల‌కు ప‌నిచేయ‌రు. చాలా సెల‌క్టివ్ గా ఉంటారు. దేవీ శ్రీప్ర‌సాద్.. థ‌మ‌న్ బిజీగా ఉన్నా సంగీతంలో క్రియేటివిటీ కొర‌వ‌డింద‌ని కొన్నాళ్లుగా విమ‌ర్శ‌లున్నాయి. ఇంకా మూస ధోర‌ణిలోనే ఉన్నార‌నేది ప‌లువురు అభిప్రాయం. ఇక సాగ‌ర్ చంద్ర.. కార్తీక్ లాంటి యువ‌త‌రం సంగీత ద‌ర్శ‌కులు క్రియేటివ్ ట్యాన్స్ ఇచ్చినా పెద్ద‌ సినిమాల‌కు ప‌నిచేసే అవ‌కాశం రాలేదు. దీంతో అలాంటి వాళ్ల ప్ర‌తిభ‌ మ‌రుగున ప‌డితోంద‌న్న ఆవేద‌నా వ్య‌క్త‌మ‌వుతూనే ఉంది.

అస‌లు మ‌న హీరోలు.. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రిస్క్ తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. మ‌న క్రియేటివిటీని పూర్తిగా న‌మ్మ‌డం లేద‌ని తాజా ప‌రిణామం చెబుతోంది. అందుకే ప‌లువురు హీరోలు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు హిందీ .. అర‌వ ట్యాలెంట్ పైనే ఆధార‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో త‌మిళ్.. మాల‌యాళం మ్యూజిక్ డైరెక్ట‌ర్లు తెలుగులో ఎక్కువ‌గా సినిమాలు ప‌నిచేస్తున్నారు. గోపీ సుంద‌ర్.. అనిరుధ్.. చిరంత‌న్ భ‌ట్.. అమిత్ త్రివేది.. సామ్ సీఎస్ .. ఇలా ప‌లువురు ఇరుగు పొరుగు నుంచి వ‌చ్చి ఇక్క‌డ హ‌వా సాగిస్తున్నారు. పొరుగు నుంచి వ‌చ్చి వీళ్లు స‌త్తా చాట‌డంతో అవ‌కాశాల‌న్ని వాళ్ల‌వే అవుతున్నాయి. తాజాగా మ‌రో ఇద్ద‌రు టాలీవుడ్ టాప్ స్లార్లు అర‌వోళ్ల‌కే అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ని సమాచారం. కింగ్ నాగార్జున‌.. నేచురల్ స్టార్ నాని క‌థానాయ‌కులుగా న‌టించ‌నున్న త‌దుప‌రి సినిమాల‌కు త‌మిళ సంగీత ద‌ర్శ‌కుడు సామ్ సీఎస్ పేరుని ప‌రిశీలిస్తున్నార‌ట‌. గ‌తంలో ఖైదీ (కార్తీ).. నోటా (దేవ‌ర‌కొండ‌) సినిమాల‌కు సామ్. సి సంగీతం అదించిన సంగ‌తి తెలిసిందే.

నాగ్ .. నాని లాంటి టాప్ స్టార్ల ప్రోత్సాహంతో సామ్ సీఎస్ దూసుకొస్తున్నాడు. ఒకే సారి రెండు పెద్ద ప్రాజెక్ట్ ల్లో ఆయ‌న‌ పేరు తెర‌పైకి రావండం అంతాటా చ‌ర్చాంశ‌నీయం అయింది. ఇంత‌కుముందు క్రిష్ కూడా గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చిరంత‌న్ భ‌ట్ ని తెచ్చుకున్నాడు..ప్ర‌స్తుతం బాల‌య్య‌-కే.ఎస్.ర‌వికుమార్ క్రేజీ ప్రాజెక్ట్ రూల‌ర్ కి ఆయ‌నే ప‌ని చేస్తున్నారు. అలాగే చిరు 152 కోసం అజ‌య్-అతుల్ సంగీత‌ద‌ర్శ‌క ద్వ‌యం పేరు వినిపిస్తోంది. ఇలా చూస్తే ఇరుగుపొరుగు సంగీత ద‌ర్శ‌కుల డామినేస‌న్ మ‌న ఇండ‌స్ట్రీలో ఇటీవ‌ల ఎక్కువైంద‌ని అర్థ‌మ‌వుతోంది.

మ‌రి ఈ ప‌క్క చూపులు ఎందుకు? టాలీవుడ్ కి ఈ అద్దె మ్యూజిక్ దుస్థితి ఏంటో? టాలీవుడ్ లో స‌త్తా చాటే ప్ర‌తిభావంతులైన‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఈ ఇబ్బంది ఎదుర‌వుతుందా? లేక ట్యాలెంట్ ని గుర్తించ‌క‌పోవ‌డ‌మే స‌మ‌స్య‌నా... మ‌న‌వాళ్లంటే చిన్న చూపు అనుకోవాలా? దూర‌పు కొండ‌లు నునుపు అని భావించాలా?.. వీట‌న్నిటికీ మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు.. హీరోలే స‌మాధానం చెప్పాలి.