Begin typing your search above and press return to search.
CCC సహాయ నిధి.. MAA లొల్లులా వద్దు సోదరా!
By: Tupaki Desk | 6 April 2020 4:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీసీసీ సహాయ నిధికి భారీ ఎత్తున విరాళాలు పోటెత్తిన సంగతి తెలిసిందే. సినిమా 24 శాఖల కార్మికుల్లో అవసరార్థులకు నెలవారీగా నిత్యావసరాల్ని పంపిణీ చేయడం దీని ఉద్ధేశం. దీనికి తమ్మారెడ్డి భరద్వాజ-ఎన్.శంకర్- మెహర్ రమేష్ తదితరులు కమిటీగా ఏర్పడి పంపిణీ చేసేందుకు సన్నాహాలు మొదలెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్.శంకర్ చేతుల మీదుగా తొలి ప్యాకేజీని కార్మికుడికి అందజేశారు. ఇకపోతే ఇప్పటికే సీసీసీ నిధికి దాదాపు 7 కోట్ల మేర ఫండ్ చేకూరిందని కార్మికుల్లో చర్చ సాగుతోంది.
అయితే ఈ మొత్తాన్ని సవ్యంగా పంపిణీ చేయగలిగితే కార్మికులకు చాలా మేలు జరుగుతుందనడంలో సందేహం లేదు. ఉద్యోగం ఉపాధి లేని ఈ విపత్తు సమయంలో తిండికి లేక నకనకలాడకుండా అసంఘటిత సినీకార్మికుల్ని ఆదుకోగలిగేందుకు సరిపడేంత ఫండ్ ఇప్పటికే వచ్చిందన్న విశ్లేషణ సాగుతోంది. ఈ మొత్తాన్ని సీసీసీ ద్వారానే పంచనున్నారు. అయితే ఈ నిధిని ఎన్ని నెలల పాటు కార్మికుల్ని ఆదుకునేందుకు వినియోగించనున్నారు? అన్నదానిపై స్పష్ఠత అయితే లేదు. బహుశా ఇకపై దీనిపైనా సీసీసీ కమిటీ లెక్కలు కడుతుందనే భావిస్తున్నారు.
ఇంతకీ సీసీసీ అంటే ఏమిటి చిరంజీవి క్రైసిస్ చారిటీ అనో లేక ఇంకేదో అనుకుంటే పొరపాటే సీసీసీ అంటే కరోనా క్రైసిస్ చారిటీ అని అర్థం. అయితే సీసీసీ చారిటీ సంస్థను రిజిస్టర్ చేసేంత సమయం లేక పోవడం వల్ల దీనిని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కి జాయింట్ చేసి నిర్వహిస్తున్నామని తమ్మారెడ్డి భరద్వాజా వెల్లడించారు. చిరంజీవికి అది ఇష్టం లేకపోయినా మేం ఆ పని చేయాల్సి వచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫీసుల సెలవుల వల్ల ఇలా చేస్తున్నాం.. అని పెద్దాయన వెల్లడించారు.
అన్నట్టు టాలీవుడ్ లో గతానుభవాల దృష్ట్యా సీసీసీ ని నిర్వహిస్తున్న కమిటీ చాలా సంగతుల్ని గుర్తుంచుకుని పని చేయాల్సి ఉంటుంది. నిధి విషయంలో ఎప్పుడూ హై అలెర్ట్ గా ఉండడం దానికి అకౌంటబులిటీ చూపించడం చాలా ఇంపార్టెంట్. అలా జరగకపోతే మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) నిధి సేకరణ గొడవల్లా ఉన్న పేరు కాస్తా చెడుతుంది. అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా.. అలాంటి లొల్లు ఏదీ రిపీట్ కాకుండా.. ఎవరూ బురద జల్లకుండా జాగ్రత్తగా చేయాల్సిన పని ఇది. డబ్బు చుట్టూనే గొడవలుంటాయి. కుళ్లు స్వార్థాలుంటాయి కాబట్టి ఆ తప్పు జరగకుండా మెగాస్టార్ స్వయంగా దీనిని మానిటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ సీసీసీకి ఎంత ఫండ్ వచ్చింది? అన్నది అధికారికంగా ప్రకటించిందేం లేదు. నిన్న ఆదివారం నుంచి సరుకులు పంపిణీ చేస్తున్నారు కాబట్టి రోజువారీ డేటాను మీడియాకి చెబుతారా? అన్నది చూడాలి. ప్రతిదీ ఓపెన్ గా జరగాలి. ఇక ఇందులో టీఆర్ ఎస్ లీడర్స్ చెయ్యేస్తున్నారు కాబట్టి ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సినిమా వాళ్ల దానాన్ని రాజకీయ నాయకుల సాయంగా చిత్రీకరిస్తే దానంత దద్ది వేషం ఇంకొకటి ఉండదు సుమీ!! అంతిమంగా సీసీసీకి ఎలాంటి అపప్రద రాకూడదని ఆకాంక్షిద్దాం.